ఇచ్చోడ, డిసెంబర్ 28 : బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పేర్కొన్నారు. సిరికొండ మండలం బీఆర్ఎస్ మండల నాయకులు షేక్ బషీర్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ రాజారాం ఆధ్వర్యంలో బుధవారం లచ్చింపూర్ (బీ) సర్పంచ్ పెందూర్ నర్మాద భగవత్, లక్కంపూర్ సర్పంచ్ సిడాం అర్చన్ గుణవంత్ ఆయా గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్పంచ్లతో పాటు కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎ స్లో చేరారు.
120 మందికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సునీల్, ఉప సర్పంచ్ గోవర్ధన్, నాయకులు పాల్గొన్నారు.