నార్నూర్, ఫిబ్రవరి 7: అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఆదిలాబాద్ జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ పేర్కొన్నారు. నార్నూర్, గాదిగూడ మండలాల్లోని శేకుగూడ, తాడిహత్నూర్, ఝరి గ్రామాల సమీపంలో రూ.7కోట్లతో చేపడుతున్న వంతెనల నిర్మాణానికి సోమవారం భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని తెలిపారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కృషితో ఉమ్మడి మండలానికి బీటీ రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం హర్షణీయమన్నారు. మే నెల వరకు వంతెన నిర్మాణాలు పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీలు కనక మోతుబాయి, చంద్రకళ రాజేశ్వర్, వైస్ఎంపీపీలు జాదవ్ చంద్రశేఖర్, మర్సువనే యోగేశ్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తొడసం నాగోరావ్, ఎంపీటీసీ ఏత్మాబాయి, సర్పంచ్ రాథోడ్ యశ్వంత్రావ్, మాజీ జడ్పీటీసీ రూపావతి జ్ఞానోబాపుష్కర్, ఆర్అండ్బీ ఈఈ నర్సయ్య, డిప్యూటీ డీఈ రమేశ్, ఏఈ అరవింద్, కాంట్రాక్టర్ పుష్కర్ రామేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.