ఆదిలాబాద్ : జైనథ్ మండలం డొల్లారా వద్ద మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలిస్తున్న దేశీదారును ( Desidaar Liquor ) ఎక్సైజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డీటీఎఫ్ టాస్క్ ఫోర్స్ ( Task Force ) అధికారులు బొల్లారం వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఆదిలాబాద్ పట్టణంలోని వడ్డెర కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు సూర రవి ,చింత సుజాతల 90 మిల్లీమీటర్ల పరిమాణం గల 1,270 అనుమతిలేని దేశీదారు సీసాలను ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్నామని 45,720 ఎక్సైజ్ శాఖ అధికారులు డీటీఎఫ్ ఇన్స్పెక్టర్ ముత్యం,అధికారి అక్బర్ హుస్సేన్ తెలిపారు. అనుమతి లేని మధ్యాన్ని విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.