ఎదులాపురం, అక్టోబర్ 7 : తెలంగాణ మోడల్ నేడు దేశానికి రోల్ మోడల్ అయింది. వివిధ రాష్ర్టాల్లోని భిన్న వర్గాల వారు దేశ్ కీ నేతా కైసా హో కేసీఆర్ జైసా హో అని నినదిస్తున్నారని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు, ఆదిలా బాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా పార్టీ రూపాంతరం చెందడంతో శుక్ర వారం జడ్పీచైర్మన్ చాంబర్లో ఎమ్మెల్యే జోగు రామన్నకు జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, జడ్పీటీ సీల ఫోరం అధ్యక్షుడు తాటిపెల్లిరాజు, నాయకు లు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ సీఎం కేసీఆర్ అందించిన ఈ అద్భుత పాలనే జాతీయ స్థాయిలో ఆయనను ఆగ్రగ ణ్యుడిగా నిలబెట్టిందని పేర్కొన్నారు. కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలతో దేశ ప్రజలం దరికీ మంచి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, నాయకులు పాల్గొన్నారు.