నిర్మల్ అర్బన్, డిసెంబర్ 5 : నిర్మల్ పట్టణ ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు 1971లో 5 లక్షల లీటర్ల సామర్థ్యంతో వాటర్ ట్యాంకును నిర్మించారు. అది ప్రస్తుతం పూర్తి శిథిలావస్థకు చేరింది. దీంతో మున్సిపల్, ఇంజినీరింగ్ అధికారులు సోమవారం దానిని కూల్చివేయించారు.
కరీంనగర్‌కు చెందిన వారు పిల్లర్లకు బ్లాస్టింగ్ సామగ్రి అమర్చి కూల్చారు. కాగా, ముందస్తుగా 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఈ ట్యాంక్ పక్కనే మరోటి నిర్మించారు. ముందస్తు సమాచారం మేరకు ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.. ట్యాంకు కూల్చివేత ప్రశాంతంగా సాగడంతో ఊపిరి పీల్చుకున్నారు.