నస్పూర్/ఆసిఫాబాద్ టౌన్, డిసెంబర్ 29 : ‘రేవంతన్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చు’ అంటూ సమగ్ర శిక్షా ఉద్యోగులు డిమాండ్ చేశారు. నస్పూర్ కలెక్టరేట్ వద్ద చేపట్టిన సమ్మె ఆదివారం 20వ రోజుకు చేరుకున్నది. ఈ సందర్భంగా ఉద్యోగులు రేవంత్‌రెడ్డి మాస్కులు ధరించగా.. మహిళా ఉపాధ్యాయులు వారికి రాఖీలు కట్టి నిరసన తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డిని.. అన్నగా భావించి రాఖీలు కట్టి.. సమస్యలు పరిష్కరించాలని కోరామని వారు తెలిపారు.
ప్రభుత్వం దిగిరావాలి
ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్షా ఉద్యోగుల దీక్ష ఆదివారం 20వ రోజుకు చేరుకున్నది. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షురాలు శృతికా మాట్లాడుతూ 20 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం దిగిరావాలని డిమాండ్ చేశారు. జూనియర్ లెక్చరర్ల సంఘం నాయకులు సునీల్, చంద్రయ్య, రాష్ట్ర ఉత్తమ అవార్డు గ్రహీత సుందిళ్ల రమేశ్ మద్దతు తెలిపారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తుకారం, జిల్లా కోశాధికారి నగేశ్, మీడియా ప్రతినిధి గేడేకార్ సంతోశ్, దుర్గం సందీప్, అన్నపూర్ణ చైతన్య , కేజీబీవీ ప్రత్యేకాధికారి కవిత, ఎంఐఎస్ ప్రధాన కార్యదర్శి ప్ర శాంత్, రాజేశ్, రాజకుమార, సీసీవో అధ్యక్షుడు అనూప్, సీఆర్పీ ప్రధాన కార్యదర్శి రాజేశ్, వెంకటేశ్, పీజీ సీఆర్టీలు అన్నపూర్ణ, స్వప్న, పీటీఐ అధ్యక్షుడు సత్యనారాయణ, రమేశ్, ప్రకాశ్, తిరుపతి, దేవేందర్, మహేశ్, శివరాం, ప్రసన్న, స్వప్న, విజయ, బాబు, తిరుపతి, సుభాష్, సతీశ్ పాల్గొన్నారు.
Adilabad