ఇంద్రవెల్లి, అక్టోబర్ 19 : ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసుల సంస్కృతి, సంప్రదాయాలు విభిన్నమైనవని.. భావితరాలకు తెలియజేసే విధంగా అభివృద్ధి చెందాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆదివారం కెస్లాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన దండారీ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ముందుగా ఎస్పీ ఏత్మాసుర్ పేన్దేవతలకు పూజలు చేశారు. అనంతరం ఆదివాసీ గిరిజనులతోపాటు గుస్సాడీలు, దండారీ బృందం సభ్యులతో కలిసి నృత్యం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉట్నూర్ సీఐ మడావి ప్రసాద్, ఎస్ఐ సాయన్న, ఎస్బీ పోలీస్ సిబ్బంది దుర్వా రమణ, రామారావ్, కెస్లాపూర్ గ్రామ పటేల్ మెస్రం వెంకట్రావ్పటేల్, గ్రామస్తులు బాదిరావ్పటేల్, మెస్రం నాగ్నాథ్, ఆనంద్రావ్, కోట్నాక్ బారిక్రావ్, కోసేరావ్, జంగు, లింబారావ్, తుకారాం, గణేశ్ పాల్గొన్నారు.