నార్నూర్ : ఏజెన్సీ ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలాల ఆదివాసి గూడెంలలో దండారి ఉత్సవాలు(Dandari festivals) మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. నార్నూర్ మండలంలోని ఎంపల్లి గోండు గూడ గ్రామంలో ఆదివాసులు భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏత్మాసూర్ పేన్ కు సాంప్రదాయ పూజలు చేశారు.
గుస్సాడి టోపీలు, డోల్, పెప్రే, తుడుం, కాలికోమ్,సూర్ణ, డప్పులు,కోలాటలకు సంబంధించిన అలంకరణ సామగ్రీలకు పూజలు చేశారు. గుస్సాడి వేషధారణ ధరించారు. దండారి ఉత్సవాలను కోలబోడి వరకు అత్యంత భక్తిశ్రద్ధలతో నియమనిష్టలతో నిర్వహించుకుంటామని గ్రామ పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పేందోర్ అమృత్ రావు పటేల్, సంతోష్, చిత్రు, రాము, ఆనందరావు, జలపతి, జగన్నాథ్ తదితరులున్నారు.