బజార్ హత్నూర్ : బ్యాంకు మేనేజర్ ( Bank manager ) ప్రవర్తన పట్ల ఖాతాదారుల (Customers ) ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన బజార్ హత్నూర్ మండలంలోని దేగామా( Degama ) గ్రామంలో చోటు చేసుకుంది. తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ ఖాతాదారులతో దురుసుగా మాట్లాడుతున్నాడని, ఇదేమిటని ప్రశ్నిస్తే మీ ఇష్టం ఉన్న చోట చెప్పుకో అని అమర్యాదగా మాట్లాడుతున్నాడని ఆరోపించారు.
ఖాతాదారులను బెదిరించడంతో శనివారం గ్రామస్థులు, ఖాతాదారులు బ్యాంకు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. బ్యాంకు మేనేజర్‌ను వెంటనే వేరే చోటకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఖాతాదారులు, గ్రామస్థులు మేకల వెంకన్న, బొడ్డు బోజన్న, పాశపు గణపతి, మడిగే రమణ, సాయిరాం, తదితరులు ఉన్నారు.