నార్నూర్ : ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ, నార్నూర్ మండలాల్లో భారీ వర్షాలకు కల్వర్టులు (Culverts ) అధ్వాన్నంగా మారాయి. ఈ కల్వర్టుల గుండా వెళ్లడానికి ప్రయాణికులు జంకుతున్నారు. గాదిగూడ మండలం ఖడ్కి కల్వర్టుపై నార్నూర్, గాదిగూడ మండల కేంద్రాలకు నిత్యం వందల వాహనాలు రాకపోకలు చేస్తుంటాయి. లో లెవెల్ కల్వర్టు పై నీరు పారుతుండడంతో పాకు పట్టింది. ఈ కల్వర్టుపై ద్విచక్ర వాహనాలు నడిపేందుకు ఇబ్బంది పడవలసి వస్తుంది. పాకు పట్టడంతో వాహనాలు జారి పడుతున్నామని ద్విచక్రవాహనదారులు వాపోతున్నారు.
లో లేవల్ కల్వర్టు గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని , ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వంతెన మంజూరు చేయాలని ఉమ్మడి మండల ప్రజలు కోరుతున్నారు.నార్నూర్ మండలం దుప్పాపూర్ గ్రామ సమీపంలోని ప్రధాన రహదారి పై కల్వర్టు అధ్వానంగా తయారైంది. వర్షానికి కోతకు గురై బురదమయంగా మారింది. ప్రయాణికులు. రాత్రివేళ వాహనం అదుపుతప్పితే ప్రాణాలు కోల్పోవాల్సిందేనని భయభ్రాంతులకు గురవుతున్నారు.