నార్నూర్ : విద్యార్థి దశ నుంచే సాంస్కృతి సాంప్రదాయాలను ( Cultural traditions ) అలవర్చుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జాదవ్ విట్టల్ ( HM Vittal ) అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత బాలికల పాఠశాలలో తీజ్ ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో తీజ్ బుట్టలకు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడాలు, సాంస్కృతి సాంప్రదాయాలను అలవర్చుకుంటూ ముందుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో పీడీ ఆడే విశ్వనాథ్, వార్డెన్ పవర్ వనిత, ఉపాధ్యాయులు వసంత్, శంకర్, రాజేశ్వర్, నీలయ్య, నూర్ సింగ్, రాజ్యలక్ష్మి, ప్రకాష్, రాజశేఖర్, పండిత్ సింగ్, విజయ, సరిత, విద్యార్థులు ఉన్నారు.