ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సాగులో సరికొత్త రికార్డు సృష్టించింది. రైతుబంధు, రైతుబీమా, సబ్సిడీపై పరికరాల వంటివి సాగుకు వరంగా మారాయి. స్వయంగా సీఎం కేసీఆర్ రైతు కావడం, అన్నదాతపై ప్రేమతో పలు పథకాలు అందిస్తుండడం వంటి వాటితో సేద్యం పెరుగుతోంది. యేటా రాష్ట్ర సర్కారు ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు పంటల సర్వే నిర్వహిస్తున్నారు. ఈ యేడాది కూడా పక్షం రోజులుగా చేస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పూర్తి కాగా.. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో కొనసాగుతోంది. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 17.71 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా.. ఇందులో పత్తి 10.09 లక్షల ఎకరాలు, వరి 3.29 లక్షల ఎకరాలు సాగయ్యాయని తేల్చారు. రాష్ట్రంలోనే పత్తి రికార్డు స్థాయిలో సాగవగా.. గతేడాది కంటే సోయా విస్తీర్ణం పెరిగింది. మార్కెటింగ్, మద్దతు ధర కల్పించేందుకు సర్వే చేస్తున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
– మంచిర్యాల ప్రతినిధి/నిర్మల్,
మంచిర్యాల ప్రతినిధి/నిర్మల్, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ వానకాలం 17,71,162 లక్షల ఎకరాల్లో పంటలు సాగులోకి వచ్చాయి. అత్యధికంగా పత్తి 10,09,276 ఎకరాలు, వరి 3,29,476 ఎకరాలు.. సోయా, మక్క, పప్పు దినుసులు లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. మద్దతు ధర, మార్కెటింగ్ సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోంది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పూర్తి కాగా.. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో కొనసాగుతోంది. ఇంకా సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. ఇన్ని లక్షల ఎకరాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాగులోకి రావడం సరికొత్త రికార్డు అని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అధికారులు యేటా రెండు సీజన్లకుFarmer’ సంబంధించి సర్వే నంబర్లవారీగా పంటల వివరాలు సేకరిస్తారు. ఈ వానకాలం సాగుపై వ్యవసాయశాఖ క్షేత్రస్థాయిలో 15 రోజుల స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ జిల్లావ్యాప్తంగా 79 క్లస్టర్ల పరిధిలో ఏఈవోలు ఆగస్టు 27 నుంచి ఈనెల 10 వరకు(దాదాపు 15 రోజులు) పంటల నమోదుపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నిర్మల్ జిల్లా పరిధిలో 4,37,663 ఎకరాల్లో పంటలు వేశారు. ఇందులో వరి 1,32,928 ఎకరాలు, మక్క 18,962, పత్తి 1,37,465, సోయా 1,22,460, కందులు 8,903, పసుపు 5,640 ఎకరాల్లో సాగు చేశారు. మరో 11,305 ఎకరాల్లో పెసర, మినుము, పప్పు దినుసులతోపాటు, కూరగాయలు సాగవుతున్నాయి.
55 క్లస్టర్ల పరిధిలో ప్రస్తుతం పంటల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు చేసిన సర్వేలో 3,43,688 ఎకరాల్లో వివిధ పంటలు వేశారు. పత్తి 1,47,515 ఎకరాలు, వరి 1,39,410 ఎకరాలు, మక్క 8,331, జనుము 220, నూనె ఉత్పత్తులు 15, కందులు, ఇతర పప్పు దినుసులు 1,185 ఎకరాల్లో వేశారు.
జిల్లాలో పంటల నమోదు ప్రక్రియ పూర్తయ్యింది. 5,49,296 ఎకరాలు సాగవుతున్నాయి. పత్తి 3,94,125 ఎకరాలు, వరి 1,787, కందులు 58,524, సోయా 87,864, మక్క 3,725, జొన్న 1,734 ఎకరాలు, మిగిలిన మొత్తంలో పప్పు దినుసులు, ఇతర పంటలు సాగులోకి వచ్చాయి.
పంటల నమోదు సర్వే కొనసాగుతోంది. 4,44,515 ఎకరాల్లో పంటలు సాగులోకి వచ్చాయి. పత్తి 3,30,171 ఎకరాలు, వరి 55,351, కందులు 39,335, సోయా 8,881, మక్క 312, జొన్న 1,279 ఎకరాలు కాగా.. మిగిలిన మొత్తంలో ఇతర పప్పు దినుసులు, కూరగాయలు సాగవుతున్నాయి.
వానకాలంలో ఏ ప్రాంతంలో ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగయ్యాయి. వాటి దిగుబడి ఎంత వస్తోందని పక్కాగా అంచనా వేసేందుకు సాగు వివరాల సేకరణ ఉపయోగపడనుంది. ఫలానా పంట ఎంత మొత్తంలో ఉత్పత్తి అవుతోందని తెలుసుకోవడంతోపాటు సంబంధిత వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడం, కొనుగోలు కోసం ప్రణాళికలు సిద్ధం చేయడానికి వివరాల సేకరణ దోహదపడనుంది. అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం, అవసరమైన మేరకు గన్నీ బ్యాగులు తెప్పించడం వంటివి చేయడానికి ఈ వివరాల సేకరణ ఉపయోగకరంగా ఉంటుంది.
ప్రతి క్లస్టర్లో ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని ప్రభుత్వం నియమించింది. వానకాలం ప్రారంభం నుంచి ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేశారన్నది ఏఈవోలు ఇప్పటికే నమోదు చేశారు. అంతేకాకుండా ప్రతి సర్వే నంబర్లోని సబ్ డివిజన్లో రైతు పేరు, భూమి విస్తీర్ణం, ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేసిన వివరాలు పక్కాగా సేకరించారు. ఇలా సేకరించిన వివరాలను రైతుబంధు ఆన్లైన్ యాప్లో ఏఈవోలు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురియడంతో జిల్లాలోని చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోగా, కొన్ని చెరువులు అలుగు పారుతున్నాయి. అలాగే భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. దీంతో గతేడాది కంటే సాగు విస్తీర్ణం పెరిగింది. గతేడాదితో పోల్చితే ఈసారి సోయాబీన్ సాగు పెరిగింది. రాష్ట్రంలోనే పత్తి ఎక్కువగా ఉమ్మడి జిల్లాలో సాగవుతోంది.
వానకాలం సీజన్లో జిల్లావ్యాప్తంగా రైతులు వేసిన పంటల వివరా లను దాదాపుగా సేకరించాం. జిల్లా వ్యాప్తంగా 4,37,663 ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు వేశారు. వివరాలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేస్తున్నాం. ఈ ప్రక్రియ తుదిదశకు చేరింది. రాబో యే రోజుల్లో సేకరించిన వివరాల ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.
– అంజీ ప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, నిర్మల్