పోడు భూముల పట్టాల పంపిణీ పూర్తి చేయాలి
పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మరో నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలంగాణకు హరితహారం, గృహలక్ష్మి, బీసీ కుల వృత్తుల ఆర్థిక సహాయం, గొర్రెల పంపిణీ తదితర అంశాలపై కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.
- రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి
ఎదులాపురం, జూలై 3: పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మరో నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలంగాణకు హరితహారం, గృహలక్ష్మి, బీసీ కుల వృత్తుల ఆర్థిక సహాయం, గొర్రెల పంపిణీ తదితర అంశాలపై కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3వేల ఇండ్ల చొప్పున గృహలక్ష్మి పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేయాలని, ఈ పథకం కింద 3 విడుతల్లో రూ.లక్ష చొప్పున మొత్తం రూ.3లక్షల ఆర్థిక సహాయం అందుతుందన్నారు.
జిల్లాలో ఎరువులు, విత్తనాల కొరత రాకుండా కలెక్టర్లు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని, ధరణిలో నూతన పట్టాదారుల బ్యాంకు వివరాలు సేకరించి అప్డేట్ చేయాలని సూచించారు. తెలంగాణకు హరితహారం కింద గ్రామాల వారిగా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయించాలన్నారు. అలాగే రెండో దశ గొర్రెల పంపిణీ పూర్తి చేయాలన్నారు వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ నిర్దేశిత ప్రభుత్వ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో ఉట్నూర్ ఐటీడీఏ పీవో చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ ఎం నటరాజ్, ఆర్డీవో రాథోడ్ రమేశ్, డీఆర్డీవో కిషన్, డీబీసీడీవో రాజలింగు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

