పోరాడి సాధించుకున్న తెలంగాణలో చరిత్రాత్మక ఆనవాళ్లయిన చార్మినార్, కాకతీయుల కళాతోరణం వంటి గుర్తులతో రూపొందించిన తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడంపై తెలంగాణ ఉద్యమకారులు, కవులు, కళాకారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ దురుద్దేశంతోనే తొలగించి ఇష్టానుసారంగా రాష్ట్ర చిహ్నాన్ని సీఎం రేవంత్రెడ్డి రూపొందించడం సరికాదంటున్నారు. సంస్కృతి, చరిత్రకు ఆనవాళ్లుగా ఉన్న వాటికి ప్రాధాన్యమిచ్చి కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర చిహ్నంలో స్థానం కల్పించింది. ఈ చిహ్నానికి ఎంతో గుర్తింపు వచ్చింది. ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నది. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే రేవంత్రెడ్డి చిహ్నాన్ని మార్చడం తెలంగాణ చరిత్రకే మాయని మచ్చగా మిగులుతున్నది. ప్రజల దృష్టిని మరల్చడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
– ఆదిలాబాథ్/నిర్మల్, మే 29(నమస్తే తెలంగాణ)