కాసిపేట : భూమికి, మనుషులకు, పశువులకు నష్టం చేసే నకిలీ విత్తనాలు అమ్మినా, సాగు చేసినా క్రిమినల్ చర్యలు ( Criminal cases ) తీసుకుంటామని కాసిపేట తహసీల్దార్ భోజన్న ( Tahasildar Bojanna) , ఎస్సై ప్రవీణ్ కుమార్, ఏవో చల్ల ప్రభాకర్ హెచ్చరించారు. గురువారం మంచిర్యాల జిల్లా కాసిపేట ( Kasipet ) మండల కేంద్రంలోని రైతు వేదికలో నకిలీ పత్తి విత్తనాలు, గ్లైసిల్ బీటీ పత్తి ( BT Cotton ) విత్తనాలను అరికట్టడంపై అవగాహన నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వ్యవసాయ శాఖ నుంచి లైసెన్స్ పొందిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని, విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని రైతులను సూచించారు. రశీదును, విత్తన ప్యాకెట్‌ను పంట కాలం పూర్తి అయ్యేంతవరకు భద్రపరుచుకోవాలని సూచించారు.
తీసుకున్న రశీదు పైన విత్తన రకం, లాట్ నెం, రేటు వివరాలు ఉండే విధంగా చూసుకోవాలని, విత్తన ప్యాకెట్ మీద లాట్ నెంబర్, విత్తన తయారీ తేదీ, గడువు తేదీ చూసుకోవాలని సూచించారు. రైతులు లూజుగా ఉన్న సంచులలోని విత్తనాలను కొనుగోలు చేయరాదని, నకిలీ పత్తి విత్తనాలు, గ్లైప్టోసిట్ అనే కలుపు నాసిని మందును తట్టుకునే పత్తి విత్తనాలకు మనదేశంలో అనుమతి లేదని వెల్లడించారు. ఆ విత్తనాలను రైతులు ఎవరు సాగు చేయవద్దని సూచించారు.
గ్లైసిల్ మందును తట్టుకునే బీటీ పత్తి రకంను సాగు చేయడం వలన భూమి ఆరోగ్యానికి, పర్యావరణానికి, మనుషులకు క్యాన్సర్, పశువుల ఆరోగ్యానికి హానికరమన్నారు. కార్యక్రమంలో ఏఈవో రమ్య, రైతులు పాల్గొన్నారు.