నిర్మల్టౌన్, మే 27 : పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెకింపును పకడ్బందీగా చేపట్టాలని నిర్మల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఓట్ల లెకింపు సందర్భం గా అధికారులు, సిబ్బందికి అవగాహన, శిక్ష ణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ నిర్మల్ జిల్లా ఓట్ల లెకింపును ఆదిలాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ అధికారులు జూన్ 4వ తేదీన ఉద యం 5.30 గంటలకు ఓట్ల లెకింపు కేంద్రాలకు చేరుకోవాలని ఆదేశించారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెకింపు ప్రక్రియ ను ప్రారంభించాలని, అనంతరం ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెకించాలని ఆదేశించారు. రౌండ్ల వారీగా లెకించిన ఓట్ల వివరా లు తెలిపేందుకు స్రీన్లను ఏర్పాటు చేయాల ని ఆదేశించారు. ఓట్ల లెకింపు సమయం లో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే సంబంధిత ఏఆర్వోలకు సమాచారం అందించాలని, రౌండ్ల వారీగా లెకింపు పూర్తికాగానే సంబంధిత ఫారాలు అన్ని జాగ్రత్తగా నింపాలని సూ చించారు. మాస్టర్ ట్రైనర్లు శ్రీనివాసరెడ్డి, శ్రీనివాస్ సిబ్బందికి ఓట్ల లెకింపు సరళిని, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సమావేశంలో నిర్మల్, ఆదిలాబాద్ అదనపు కలెక్టర్లు కిశోర్ కుమార్, శ్యామలాదేవి, నిర్మల్, భైంసా,ఉట్నూర్ ఆర్డీవోలు రత్నకళ్యాణి కోమల్ రెడ్డి, జీ వాకర్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.