మంచిర్యాల ఏసీసీ, మార్చి 1 : మంచిర్యాల మున్సిపాలిటీలోని 24వ వార్డు పరిధిలోగల రెడ్డి కాలనీ పారు ను పరిరక్షించాలని కౌన్సిలర్ వేములపల్లి సంజీవ్ కోరారు. ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, వైస్ చైర్మన్ సల్ల మహేశ్‌కు శుక్రవారం వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల ‘పట్టణ ప్రగతి’ నిధులు రూ.40 లక్షలతో పారు నిర్మాణం చేపట్టి, ప్రా రంభినట్లు తెలిపారు. నిర్వహణ సరిగాలేకపోవడంతో పారులోని పిల్లల ఆట వస్తువులు, జిమ్ పరికరాలు, గ్రీనరీ పాడైపోయాయని పేర్కొన్నారు.