Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
Cotton Procurement | నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని నాగేష్ పత్తి మిల్లులో సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.
కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్ (Kubheer ) మండల కేంద్రంలోని నాగేష్ పత్తి మిల్లులో సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు (Cotton Procurement ) ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మిల్లులో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, పత్తి కొనుగోళ్లను లాంఛనంగా ప్రారంభించారు. తొలుత పత్తిని తీసుకువచ్చిన వాహనాలకు, పత్తి తూకం వేసే యంత్రాలకు పూజలు నిర్వహించి, పత్తి కొనుగోళ్ల సీజన్ రైతులకు, వ్యాపారులకు లాభదాయకంగా సాగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పత్తి విక్రయించేందుకు మిల్లుకు వచ్చిన పలువురు రైతులను వ్యాపారులు శాలువాలతో సత్కరించారు. కొనుగోలు చేసిన పత్తికి క్వింటాల్‌కు రూ.9,100 చొప్పున ధర చెల్లించినట్లు మిల్లు యజమానులు వెల్లడించారు. పత్తి నాణ్యత, తేమ శాతం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలని ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు పేర్కొన్నారు.
అనంతరం మిల్లు నిర్వాహకులు రెడ్డిశెట్టి సంతోష్, ఆనంద్ ఆధ్వర్యంలో అన్నదానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గోనే కళ్యాణ్, సర్పంచ్ కందూరి సాయినాథ్, ఏఎంసీ కార్యదర్శి, పీఏసీఎస్ సీఈవో ఎగ్గం క్రాంతికుమార్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు తోకల మారుతి, రైతులు, వ్యాపారులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

