ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్ : శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డెన్ సెర్చ్ (Cordon search) చేపడుతున్నట్లు ఆసిఫాబాద్ పట్టణ సీఐ రవీందర్(CI Ravinder) తెలిపారు. జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు, అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు, ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ ఆదేశాల సోమవారం పట్టణంలోని ఆర్ఆర్ కాలనీలో సీఐ తన బృందంతో కలిసి ప్రతి ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీలలో సరైన ధృవపత్రాలు లేని 82 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సీఐ మాట్లాడుతూ రానున్న రోజులలో మరింత విస్తృతంగా తనిఖీలు చేపడతామని, ప్రతి ఒక్కరూ తమ వాహనాలకు సరైన పత్రాలను కలిగి ఉండాలని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు, 60 మంది పోలీసులు పాల్గొన్నారు.