డంపర్‌ను ఢీకొట్టిన వోల్వా వాహనం
శ్రీరాంపూర్ ఓసీపీలో జరిగిన ప్రమాదంలో కాంట్రాక్టు కార్మికుడు మొగిళి శ్రీకాంత్‌కు తీవ్ర గాయాలై కుడికాలు కోల్పోయాడు. కార్మికుల కథనం ప్రకా రం.. ఓసీపీలో మట్టి తవ్వకాలు, తరలింపు జరుగుతుండగా.. బుధవారం తెల్లవారు జామున ఐదు గంటలకు వోల్వా డ్రైవర్ తను నడుపుతున్న వాహనాన్ని ముందున్న డంపర్‌కు ఢీకొట్టాడు.
- కాంట్రాక్టు కార్మికుడికి తీవ్ర గాయాలు
- తెగిపడ్డ కుడికాలు
- శ్రీరాంపూర్ ఓసీపీలో ప్రమాదం
- కార్మికుల ఆందోళన
శ్రీరాంపూర్, ఫిబ్రవరి 14 : శ్రీరాంపూర్ ఓసీపీలో జరిగిన ప్రమాదంలో కాంట్రాక్టు కార్మికుడు మొగిళి శ్రీకాంత్‌కు తీవ్ర గాయాలై కుడికాలు కోల్పోయాడు. కార్మికుల కథనం ప్రకా రం.. ఓసీపీలో మట్టి తవ్వకాలు, తరలింపు జరుగుతుండగా.. బుధవారం తెల్లవారు జామున ఐదు గంటలకు వోల్వా డ్రైవర్ తను నడుపుతున్న వాహనాన్ని ముందున్న డంపర్‌కు ఢీకొట్టాడు.
దీంతో మొగిళి శ్రీకాంత్ కుడికాలు పూర్తిగా విరిగి వేరుగా పడింది. దీంతో తోటి కార్మికులు శ్రీకాంత్‌ను మంచిర్యాలకు తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శ్రీకాంత్ రామగుండం మండలం మూర్మూర్ గ్రామానికి చెందిన వాడు. కాగా రోజూ అక్కడి నుంచే వచ్చి విధులు నిర్వర్తిస్తున్నాడు.
కార్మికుల ఆందోళన
శ్రీకాంత్‌కు నష్టపరిహారం చెల్లించాలని తాళ్లపల్లి, సింగాపూర్ కౌన్సిలర్ బండారి సంధ్యారాణి సుధాకర్ జీవీఆర్ సంస్థ మేనేజర్ పెంచలయ్యను డిమాండ్ చేశారు. డంపర్ ఆపరేట ర్లు, కార్మికులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు జోక్యం చేసుకొని ప్రమాదానికి గురైన శ్రీకాంత్‌కు పూర్తి వైద్యం అందించాలని,
కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని సూచించిన మేరకు జీవీఆర్ యాజమాన్యం అంగీకరించడంతో కార్మికులు ఆందోళన విరమించారు. కాగా.. కాంట్రాక్టు సంస్థ మట్టి తవ్వకాలు, తరలింపు పనుల్లో వాహనాల నిర్వహణలో కనీస రక్షణ చర్యలు తీసుకోవడం లేదని కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్(ఏఐటీయూ) రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్‌ఖాన్ ఆరోపించారు. ప్రమాద స్థలాన్ని సందర్శించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

