జైపూర్, డిసెంబర్ 15 : ఎస్టీపీపీలో ఏర్పాటు చేస్తున్న మిథనాల్ ప్లాంటు నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సింగరేణి సీఎండీ బలరాంనాయక్ పేర్కొన్నారు. ఆదివారం ఎస్టీపీపీని సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరులోగా మిథనాల్ ప్లాంటును ప్రారంభించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్లాంట్ నుంచి వెలువడే కార్బన్‌డయాక్సైడ్‌ను హైడ్రోజన్‌లో మిలితం చేసి మిథనాల్‌ను తయారుచేసుకోవచ్చని తెలిపారు. దీని ద్వారా సింగరేణికి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని పేర్కొన్నారు. ఇక్కడ తయారైన మిథనాల్‌ను పెయింట్స్, ప్లాస్టిక్, ఫెర్టిలైజర్స్వంటి పరిశ్రమలకు అందించి సంస్థకు అదనపు ఆదాయాన్ని సమాకూర్చవచ్చని తెలిపారు. అనంతరం హరితహరం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలు, వనాలను పరిశీలించారు. అంతకు ముందు ఎస్టీపీపీ ఆవరణలో రిజర్వాయర్ ప్రాంతంలో 209 మొక్కలు నాటారు. దీంతో సింగరేణి వ్యాప్తంగా ఇప్పటి వరకు 18500 మొక్కలు నాటినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈడీ రాజశేఖర్, శ్రీరాంపూర్ జీఎం సూర్యనారాయణ, జీఎం పీసీఎస్ శ్రీనివాసులు, సీఐఎస్ఎఫ్ కమాండెంట్ యోగేష్ఫర్మార్, ఏజీఎం సివిల్ కేఎన్ ప్రసాద్, డీజీఎం పంతుల, పర్సనల్ అధికారి తుకారాం పాల్గొన్నారు.
ఉత్పత్తి లక్ష్యాల సాధనకు కృషి చేయాలి
మందమర్రి, డిసెంబర్ 15 : బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనకు సమష్టిగా కృషి చేయాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరాం సూచించారు. మందమర్రి ఏరియాలోని కేకే ఓసీని ఆదివారం ఆయన సందర్శించారు. కేకే ఓసీ వద్ద ఏరియా జనరల్ మేనేజర్ దేవేందర్ సీఎండీ బలరాంకు పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆయన వ్యూపాయింట్ నుంబి ఓసీ పరిసరాలు, పని స్థలాలను పరిశీలించారు. ఓసీలో ఉత్పత్తి వివరాలను జీఎంను అడిగి తెలుసుకున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వ్యూపాయింట్ వద్ద మొక్కలు నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో మందమర్రి ఏరియా జీఎం దేవేందర్, శ్రీరాంపూర్ ఏరియా జీఎం సూర్యనారాయణ, కేకే ఓసీ ప్రాజెక్టు ఆఫీసర్ మల్లయ్య, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.
శ్రీరాంపూర్ ఓసీపీ సందర్శన
శ్రీరాంపూర్, డిసెంబర్ 15 : శ్రీరాంపూర్ ఓసీపీని సీఎండీ బలరాం ఆదివారం సందర్శించారు. జీఎం ఎల్వీ సూర్యనారాయణతో కలిసి ఓసీపీ క్వారీ, ఓబీ డంప్‌యార్డును పరిశీలించారు. అనంతరం పీవో శ్రీనివాస్‌తో కలిసి ఓసీపీ ఉత్పత్తి పనిస్థలాలను పరిశీలించారు. సీఎండీ మాట్లాడుతూ ఉత్పత్తి, రవాణాకు సమ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఓసీపీ మేనేజర్ బ్రహ్మాజీ, సేఫ్టీ ఆఫీసర్ శ్రీనివాస్, సర్వే ఆఫీసర్ సంపత్, సెక్యూరిటీ ఆఫీసర్ జక్కారెడ్డి పాల్గొన్నారు.