నార్నూర్ : ఏజెన్సీ చట్టాలకు ( Agency laws ) విరుద్ధంగా గిరిజనేతరులు అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనాలను ( Constructions ) నిలిపివేయాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల ప్రధాన కార్యదర్శి అర్కా గోవింద్ డిమాండ్ చేశారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో పంచాయతీ కార్యదర్శి కుమ్ర మోతిరాంకు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజ నేతరులు ఎలాంటి అనుమతులు లేకుండా భవనాలను నిర్మిస్తున్నా కనీసం అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. భవనాల పనులను నిలిపివేయాలని, నోటీసులు జారీ చేయాలని కోరారు. లేనిపక్షంలో సంబంధిత శాఖ అధికారులపై న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుమ్ర జైతు, సెడ్మాకి వినోద్, గంగారం, తిరుపతి ఉన్నారు.