నార్నూర్ : గిరిజనులకు ( Tribals ) మెరుగైన విద్యానందించడంలో కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వం సవతి ప్రేమను చూపిస్తుందని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు పెందోర్ సంతోష్ ( Santhosh ) ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండల కేంద్రంలో గురువారం విలేకరులతో మాట్లాడారు.
టీజీ టీడబ్ల్యూయూ, ఆర్జేసీ కళాశాలలను విలీనంతో ఉమ్మడి జిల్లాలోని గిరిజన విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల ఎస్టీ విద్యార్థులతో పాటు ఎస్సీ, బీసీ విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమవుతారన్నారు.
ఇప్పుడిప్పుడే ఆదివాసులు చదువుకు ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో విలీనం ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఎస్టీ స్టడీ సర్కిల్, గిరిజన యూనివర్సిటీ లేకపోవడంతో గిరిజనులు ఉన్నత చదువుల్లో వెనుకబడి ఉన్నారని పేర్కొన్నారు.