తాండూర్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు (Congress promises ) నెరవేర్చాలని బీజేపీ ( BJP ) నాయకులు డిమాండ్ చేశారు. తాండూర్ మండల అధ్యక్షుడు దూడపాక భరత్ కుమార్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సోమవారం ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం మండల తహసీల్దార్, ఎంపీడీవోలకు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని కోరారు. అర్హులైన వృద్ధులకు, దివ్యాంగులకు, వితంతువులకు పెన్షన్ మంజూరు చేయాలని కోరారు.
మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలకు పక్కా భవనాన్ని నిర్మించాలన్నారు. నర్సాపూర్ గ్రామపంచాయతీకి వెళ్లే దారిలో భీమన్న వాగు పై హై లేవల్ బ్రిడ్జి నిర్మించాలని, గత కొన్ని సంవత్సరాలుగా పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టా పాస్ బుక్ లు ఇవ్వాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ, జిల్లా ఉపాధ్యక్షుడు పులగం తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి చిలుముల శ్రీకృష్ణదేవరాయలు,రాష్ట్ర సీనియర్ నాయకులు చిలువేరు శేషగిరి, జిల్లా కార్యవర్గ సభ్యులు విజయ్, జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి పాగిడి చిరంజీవి, మండల ప్రధాన కార్యదర్శులు పుట్ట కుమార్, మామిడి విగ్నేష్, సీనియర్ నాయకులు సిద్ధం మల్లేష్, చొక్కాల నాగభూషణ్, మాజీ వార్డు సభ్యులు దుర్గ చరణ్, మండల ఉపాధ్యక్షులు రేవెల్లి శ్రీనివాస్, కొండు రవి, మండల కార్యదర్శి గాదె రాజేశం, మండల కోశాధికారి రాచర్ల సురేష్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి అడ్వల సతీష్, అరికల శంకర్, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.