భీంపూర్, జూన్ 27: కాంగ్రెస్ సర్కారు ఆర్భాటంగా ప్రకటించిన అందరికీ రుణమాఫీ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సాయంతో పాటు తులం బంగారం ఏమయ్యాయని బో థ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ ప్రశ్నించారు. అధికారులు, నాయకులతో కలిసి శుక్రవారం భీంపూర్ రైతువేదికలో 32 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు ఎమ్మెల్యే అందజేశారు. మరో 20మందికి చెక్కులు త్వరలో అందుతాయన్నారు. రైతువేదిక ఆవరణలో మొక్కలు నాటారు. తర్వా త భీంపూర్‌లో రూ.5 లక్షల ఎమ్మెల్యే నిధులతో సవారీ బంగ్లాకోసం భూమి పూజచేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం ప్రపంచంలో ఎక్కడా లేదని గుర్తుచేశారు. ఆదిలాబాద్ – కరంజి(టీ) 40 కిలోమీటర్ల రోడ్డు చాలావరకు అధ్వానంగా మారడంతో 18 కిలోమీటర్లు గ్రావెల్ రోడ్డు , మరమ్మతులకు రూ.20 లక్షలు మంజూరు చేశామని వెల్లడించారు. ఈ పనులు రెండురోజుల్లోనే మొదలవుతాయని ప్రకటించారు. సరిహద్దు గుబిడి వరకు క్రమం గా రోడ్డు నిర్మిస్తామన్నారు. రుణమాఫీ, పోడు పట్టాలపై మొన్న జడ్పీ సమావేశంలో మంత్రులకు విన్నవించామని ఎమ్మెల్యే గుర్తుచేశారు. మండలంలోని అన్ని గ్రామం లో హైమాస్ట్ లైట్లు, సీసీ రోడ్లు ఇచ్చామని ఇక పంట చేలకు వెళ్లే దారుల్లో రోడ్డు నిర్మించి రైతులకు సౌలభ్యంగా ఉండేలా చేస్తామన్నారు. ప్రతి ఆదివాసీ గ్రామంలో అర్హులందరికీ ఇండ్లు మం జూరు చేయిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అనంతరం గ్రామంలోని చిన్నారులను ఎత్తుకుని చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చారు. మహిళలు, రైతులను మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వివిధ గ్రామాల బీఆర్ఎస్ కార్యకర్తలను పలుకరించి వారిలో నూతనోత్సాహం నింపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నలందప్రియ, ఏవో శ్రీనివాస్‌రెడ్డి, ఆర్ఐ రాందాస్, ఏఈవోలు శంకర్, వికాల్, మాజీ జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, బీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్య, నాయకులు మడావి లింబాజీ, ఉత్తంరాథోడ్, ధరంసింగ్, రవీందర్, కేదారేశ్వర్‌రెడ్డి, జీ. నరేందర్, అనిల్, నితిన్, ఎం. కల్చాప్యాదవ్, ముకుంద సంతోష్, కపిల్, వినోద్, అశోక్, అఫ్రోజ్, సంతోష్, నవీన్, 15 గ్రామాల మహిళా లబ్ధిదారులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు.
మహారాష్ట్ర కిన్వట్లో ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ సేవా దవాఖానను ప్రారంభించారు. ఎమ్మెల్యేను అక్కడి వైద్యు లు, నాయకులు సన్మానించారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ నాయకులు గడ్డం లస్మన్న, గోవర్ధన్‌యాదవ్, నరేందర్, లింబా జీ, గంగయ్య, మార్సెట్టి అనిల్, రాజన్న, గోప మహేందర్ తదితరులున్నారు.