ఆదిలాబాద్, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో సాగునీటి సౌకర్యం లేకపోవడంతో వానకాలంలో అధికంగా పంటలు సాగవుతాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలతోపాటు పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేసి అన్నదాతలకు అండగా నిలిచింది. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులు సంతోషంగా సాగు చేస్తూ కుటుంబాలను పోషించుకున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం చేయాలంటేనే భయపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కాంగ్రెస్ సర్కారు రద్దు చేస్తూ.. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులను నష్టాలబారిన పడేలా చర్యలు తీసుకుంటుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన రైతుబీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా నిలిచింది. ఇంటిపెద్ద దిక్కును కోల్పోయిన ఆర్థికంగా చేయూత అందించేలా ఈ పథకం ఉపయోగపడింది. రైతుబీమా పథకంలో రైతులు ఎలాంటి కారణంతో మరణించినా రైతు కుటుంబాలని రూ.5 లక్షల పరిహారం ఎల్ఐసీ ద్వారా చెల్లించేలా చర్యలు తీసుకుంది.
ఎనిమిది సంవత్సరాల కిందట కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథంలో ఆదిలాబాద్ జిల్లాలో రైతుల సంఖ్య క్రమంగా పెరుగుతూ రాగా గతేడాది 1,01,679 మంది ఉన్నారు. రైతుబీమా పథకం అమల్లో భాగంగా యేటా ప్రభుత్వం ఎల్ఐసీకి ప్రీమి యం చెల్లించాల్సి ఉంటుంది. ఏటా ఆగస్టు 14న ప్రీమియం చెల్లించాల్సి ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది ఎల్ఐసీకి డబ్బులు చెల్లించకుండా పథకాన్ని రద్దు చేసింది. దీంతో రైతులు ఏ కారణం చేతనైనా మరణించినా వారికి పరిహారం వచ్చే అవకాశాలు లేకుండా పోయాయి. రైతుల ఈ పథకం కోసం దరఖాస్తులు స్వీకరించే అవకాశం లేకుండా పోయింది. పథకం రద్దు కావడంలో జిల్లాలో లక్షకు పైగా రైతులకు భరోసా లేకుండా పోయింది. పథకాన్ని ప్రభు త్వం రద్దు చేయడంతో రైతుల్లో ఆందోళన నెలకొన్నది. రైతులు ఏ కారణం చేతనైన చనిపోతే ఆ కుటుంబాలకు రై తు బీమా పథకం భరోసాగా ఉండేదని రైతు సంఘాల నాయకులు అంటున్నారు. పథకాన్ని నిలిపివేయడంతో కుటుంబపెద్దను కో ల్పోయామనే బాధతోపాటు అప్పు లు, ఆర్థిక ఇబ్బందులు భారంగా మారనున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
