దస్తురాబాద్,ఫిబ్రవరి 5 : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ఖానాపూర్ నియోజకవర్గ ప్రజల తరఫున పోరాడుతామని ఖానాపూర్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఆయ న మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల తరఫున కొట్లాడేది ఒక్క బీఆర్ఎస్ పార్టీనేనని అన్నారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. 2 నెలలకే ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తున్నదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హో దాలో మొదటిసారిగా ఖానాపూర్ నియోజకవర్గానికి సీఎంరేవంత్ రెడ్డి వచ్చారని, కనీసం ఒక్క రూపాయి కూ డా మంజూరు చేయలేదని మండిపడ్డారు.
పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశం ఈ నెల 8వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రద్దయినట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్తకూ బీఆర్ఎస్ పార్టీ అండ గా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పీ సింగరి కిషన్, వైస్ ఎంపీపీ భూక్యా రాజు నాయక్, పీఏసీఎస్ డైరెక్టర్ సత్తన్న, మాజీ సర్పంచ్లు సురేశ్ నాయక్, శంకర్, మాజీ ఉప సర్పంచ్ మాణిక్ రావు, మండలాధ్యక్షుడు ముడికే ఐలయ్య యాదవ్, నాయకు లు రమేశ్ రావు, కమలాకర్ గౌడ్, గంగన్న, రాజన్న, గోపి, నన్న రాజు, రాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 5: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్దే గెలుపని ఖానాపూర్ నియోజవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ అన్నారు. మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల కమిటీ నాయకులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో లేనప్పటికీ పార్టీ బలంగా ఉందన్నారు. కార్యకర్తలు అధైర్యపడవద్దని తెలిపారు.
ఈ నెల 12న ఖానాపూర్లో నిర్వహించే నియోజకవర్గస్థాయి కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి మాజీ మంత్రి కేటీఆర్ రానున్నారని తెలిపారు. ఈ సమావేశంలో కార్యకర్తలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఎంపీపీ పోటే శోభాబాయి, పార్టీ మండలాధ్యక్షుడు డోంగ్రే మారుతీపటేల్, వైస్ ఎంపీపీ పడ్వాల్ గోపాల్, మండల కోఆప్షన్ సభ్యుడు మీర్జా జిలానీ బేగ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు అంజద్, మాజీ ఎంపీపీ కనక తుకారం, ఎంపీటీసీ కోవ రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.