బైబై.. వెళ్లొస్తాం
ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారంతో ముగియగా, విద్యార్థులు ఇంటిబాట పట్టారు. ఒకరికొకరు టాటా.. బైబై చెప్పుకుంటూ కేరింతలు కొడు తూ ముందుకు కదిలారు. ఆయా కళాశాలల నుంచి లగేజీలతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు చేరగా, కిటకిటలాడాయి.
- ముగిసిన ఇంటర్ సెకండియర్ పరీక్షలు
- ఇంటిబాట పట్టిన విద్యార్థులు
మంచిర్యాల అర్బన్, మార్చి 14 : ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారంతో ముగియగా, విద్యార్థులు ఇంటిబాట పట్టారు. ఒకరికొకరు టాటా.. బైబై చెప్పుకుంటూ కేరింతలు కొడు తూ ముందుకు కదిలారు. ఆయా కళాశాలల నుంచి లగేజీలతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు చేరగా, కిటకిటలాడాయి. జిల్లాలోని 25 పరీక్షా కేంద్రాల్లో ప్రశాంతంగా పరీక్షలు పూర్తయ్యాయి. 6,351 (జనరల్ 5,500, వొకేషనల్ 851) మంది విద్యార్థులకుగాను 6,083 (జనరల్ 5,266, వొకేషనల్ 817) మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 268 (జనరల్ 234, వొకేషనల్ 34) మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇంటర్ పరీక్షా కేంద్రాలను డీఐఈవో శైలజ తిరిగి పరిశీలించారు.
ఆసిఫాబాద్ టౌన్,మార్చి14 : జిల్లాలోని 19 కేంద్రాల్లో 4,570 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 4,416 మంది హాజరయ్యారు. ఇందులో జనరల్ విద్యార్థులు 4,022 మంది ఉండగా, 3,900 మంది హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సులో 548 మందికి, 516 మంది హాజరయ్యారు. ఎక్కడా మాస్ కాపీయింగ్ కేసులు నమోదు కాలేదు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడానికి కృషి చేసిన సిబ్బందిని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి నైతం శంకర్ అభినందించారు. శుక్ర, శనివారాల్లో ఒకేషనల్ విద్యార్థులకు బ్రిడ్జి కోర్స్ పరీక్ష జరుగుతుందని తెలిపారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

