నల్లగొండ, జూలై 31: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్‌తో యూరియా దొరక్క ఎంతో ఇబ్బందులు పడుతున్న రైతుల నెత్తిపై త్వరలో మరో గుదిబండ పెట్టనుంది. ప్రస్తుతం ఒక్క యూరియాకు మాత్రమే యాప్ ఉండగా ఈ నెలలో అన్ని ఎరువులకు యాప్ పెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాలో అమలవుతున్న ఈ యాప్ విధానాన్ని ఈ నెల 3 నుంచి పది జిల్లాలు, 13 నుంచి మరో పది జిల్లాలు, 20 నుంచి మిగిలిన జిల్లా ల్లో అమలు చేసే విధంగా చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం మండలం యూనిట్‌గా యూరి యా యాప్ అమలవుతున్న నేపథ్యంలో రైతు లు యాప్‌లో బుక్ చేసుకొని ఏ దుకాణంలో బుక్ అయిందో చూసుకొని తెచ్చుకుంటున్నా రు. ఈ నెల నుంచి అన్ని ఎరువులు బుక్ చే సుకొని తెచ్చుకోవాలని ప్రకటించడంతో రైతు లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్జిన్ ఉన్న అన్ని కాంప్లెక్స్ ఎరువుల సమస్య పెద్దగా రాకపోయినా యూరియా, డీఏపీ కొరత మాత్రం ఈ యాప్ వల్ల తీవ్రమై వ్యవసాయం చేయాలంటేనే ఇబ్బంది పడా ల్సి రావొచ్చు.
సంక్షోభంలోకి వ్యవసాయం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ విధానాల కారణంగా రానున్న రోజుల్లో వ్యవసాయం తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టబడుతోంది. రైతును రాజు చేయాలనే ఆలోచనతో గత బీఆర్ఎస్ సర్కారు అనేక సంక్షేమ పథకాలు అందివ్వడంతో పాటు ఎరువుల కొరత లేకుండా చేసింది. దీంతో ఆ పదేండ్లల్లో వ్యవసాయం పండగలా మారింది. ఈ రెండున్నరేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం ఎగ్గొట్టడం, సంపూర్ణ రుణమాఫీ చేయకపోవడం, రైతుబీమాను అటకెక్కించటంతో పాటు ఎరువుల కొరత సృష్టించడంతో సాగు క్రమంగా తగ్గుతోంది. గత ఏడాది తీవ్రమైన ఎరువుల కొరత కారణంగా రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారు. యూరియా కోసం ప్రత్యేక యాప్ తీసుకొచ్చి ఆ కొరతను మరిం త తీవ్రతరం చేసిన విషయం తెలిసిందే. ఈ నెల నుంచి యూరియాతో పాటు అన్ని కాంప్లె క్స్ ఎరువులు యాప్‌లో బుక్ చేసుకొని తెచ్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో ఇస్తున్న ఎరువులకు ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ సర్కారు యాప్ పేరుతో ఎరువులు రైతులకు సకాలంలో అందకుండా చేస్తుండటంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎరువుల కోసం అష్ట కష్టాలు
రైతులు తమ గ్రామంలోని ఫర్టిలైజర్ డీలర్ వ ద్దనే కావాల్సిన ఎరువులు డబ్బులున్నా లేకపోయినా వారికున్న పరిచయం మేరకు తెచ్చుకొ ని వ్యవసాయం చేసుకునేవారు. ప్రస్తుత ప్ర భుత్వం మండలాన్ని యానిట్గా యాప్ ఏ ర్పాటు చేసింది. ఏ దుకాణంలో బుక్ చేశారో అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు. ఎకరాకు రెండు బస్తాల వంతున యూరియా బుక్ అవుతోంది. ఎకరమున్న రైతు రెండు బస్తాలకు, ప దెకరాలున్న రైతు 20 బస్తాలకు రవాణా ఖ ర్చులు పెట్టుకొని తెచ్చుకుంటున్నారు. ఇక నుంచి కాంప్లెక్స్ ఎరువులు సైతం అదే యాప్ లో బుక్ చేసుకొని అన్నింటినీ అదే ప్రాసెస్‌లో తెచ్చుకోవాలని ప్రకటించారు. స్థానిక ఫర్టిలైజర్ దుకాణాల్లో కాకుండా వేరే గ్రామాలు, లేదంటే పట్టణాల్లో ఈ ఎరువులు బుక్ అవుతున్నందున ఆ డీలర్లతో రైతులకు పరిచయం లేకపోవడంతో తప్పనిసరిగా డబ్బులు పెట్టి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
అధికారుల వత్తిడి మేరకే యూరియా విక్రయం
యూరియా బస్తా ధర రూ.266 ఉంది. యూరియాను స్టాక్ పాయింట్ నుంచి తెచ్చుకోవడానికి డీలర్లకు ఒక్కో బస్తాకు రూ.15 నుంచి రూ.25 వరకు ఖర్చు అవుతుంది. దీనిలో లాభం లేకపోయినా.. నష్టంతో అమ్మినా రైతులు తమ దుకాణానికి వస్తే ఇతర ఉత్పత్తుల ద్వారా లాభం వస్తుందని డీలర్లు తెచ్చి అమ్మేవారు. ప్రస్తుతం యూరియా యాప్‌తో స్థానిక రైతులు కాకుండా వేరే గ్రామాల నుంచి వస్తుండటంతో వారికి ఇస్తే తమకేంటి లాభం అనుకొని డీలర్లు యూరియా తేవటానికి ఇష్టపడటం లేదు. వ్యవసాయ అధికారులు డీలర్లపై వత్తిడి చేసి బలవంతంగా యూరియా బుక్ చేయించి డెలివరీ చేయిస్తున్నారు. లేదంటే చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారు. ఇక ఈ నెల నుంచి అన్ని ఎరువులకు యాప్ ఏర్పాటు చేస్తే ఎలాంటి లాభం లేని డీఏపీతో సమస్య ఏర్పడనుంది. ప్రస్తుతం డీఏపీ బస్తా ధర రూ.1,350 ఉంది. దీన్ని ప్రస్తుతం హోల్‌సేల్ డీలర్లే రూ.1650 వరకు ఇస్తున్నారు. యాప్ ఓపెన్ చేస్తే రూ.200 అదనంగా పెట్టుకొని ఇతర రైతులకు అమ్మితే ఏం ఉపయోగం ఉండదు. దీంతో కొరత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. ఇక కాంప్లెక్స్ ఎరువులు 20-20-0-13, 28-28-0, 14-35-14,10-26-26తో పాటు ఎమ్వోపీలపై కొంత మార్జిన్ ఉన్నందున వీటితో సమస్య రాకపోయినా యూరియా, డీఏపీల కొరత మాత్రం తీవ్రమయ్యే అవకాశం ఉంది.
చదువురాని రైతుల పరిస్థితి అగమ్యగోచరం
ఫర్టిలైజర్ యాప్‌తో రైతులు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఎరువులు తెచ్చుకుంటున్నా… దీని కారణంగా చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. చదువురాని రైతుల వద్ద స్మార్ట్ ఫోన్లు లేనందున వేరే వారి దగ్గరకు వెళ్లి బతిలాడి బుక్ చేయించుకోవాల్సిన పరిస్థితి. ఇక పార్ట్-బీ రైతుల వద్ద పట్టాదారు పాసు పుస్తకాలు లేనందున వారి పేరుమీద ఫర్టిలైజర్ బుక్ కావడం లేదు. కొందరు బిగ్షాట్స్, అఫిషియల్స్, బిజినెస్‌మెన్స్ లాంటి వారి పేరుమీద భూములు ఉండి వేరే వాళ్లకు కౌలు ఇస్తే వారు పాస్‌బుక్ ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.
అన్ని ఎరువులు యాప్ ద్వారా తీసుకోవాలి
ప్రస్తుతం యూరియా మాత్రమే యాప్ ద్వారా రైతులకు ఇస్తున్నాం. ఈ నెల నుంచి విడతలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎరువులు యాప్ ద్వారానే బుక్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. పట్టాదారు పాసు పుస్తకాల ద్వారా యాప్‌లో బుక్ చేసుకొని.. ఎక్కడ బుక్ అయిందో చూసుకొని తెచ్చుకోవాలి.
-వి.వినోద్ కుమార్, నల్లగొండ డీఏవో