నార్నూర్ : పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి బాలాజీ కాంబ్లే (Kamble ) అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ ( Adilabad ) జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లోని జాతీయ సేవా పథకం వాలంటరీలు మహాగావ్ పంచాయతీ పరిధిలోని శేకుగూడ గ్రామం గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల పరిసర ప్రాంతంలో చెత్తాచెదారం, పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరిచారు.
ఈ సందర్భంగా ప్రోగ్రాం అధికారి మాట్లాడుతూ జాతీయ సేవా పథకం శీతాకాలం శిబిరంలో భాగంగా వారం రోజులపాటు శేకుగూడ గ్రామంలో రోజువారి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. స్థానికుల సహకారంతో వాలంటరీల ద్వారా పలు కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మెస్రం భీంభాయి, కళాశాల ప్రిన్సిపాల్ వెంకట కేశవులు, అధ్యాపకులు వెంకటరమణ, జలంధర్, ఎన్ఎస్ఎస్ వాలంటరీలు ఉన్నారు.