చెన్నూర్ టౌన్, మార్చి 24 : తెలంగాణ బాపు, తెలంగా ణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జి డా.రాజారమేశ్ డిమాండ్ చేశారు. సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. కేసీఆర్‌పై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు బండి సంజయ్‌పై కేసు నమోదుచేయాలని, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం చెన్నూర్ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో పార్టీ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గ నాయకుడు డా.రాజారమేశ్ మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలన్నారు.
బీదర్‌లో దొంగనోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ ఉందని, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆ నకిలీ నోట్లనే ఓటర్లకు పంచారని ఇష్టారీతిన మాట్లాడడం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్ పార్టీపై నోరుజారితే ఖబడ్దార్ అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సాధనబోయిన కృష్ణ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నవాజొద్దీన్, మాజీ ప్రజాప్రతినిధులు మంత్రి బాపు, మోతె తిరుపతి, రేవెల్లి మహేశ్, జోడు శంకర్, శ్రీనివాస్, నాయకులు నాయిని సతీశ్, సురేశ్ రెడ్డి, భారతి, రవి, మల్లేశ్, కొప్పుల రవీందర్, నాయబ్, సురేశ్, ఆశిష్, జలీల్, ప్రశాంత్ పాల్గొన్నారు.
మందమర్రి, మార్చి 24: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కేసీఆర్‌పై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు బండి సంజయ్‌పై కేసు నమోదు చేయాలని కోరుతూ సోమవారం మందమర్రి ఎస్ఐ రాజశేఖర్‌కు ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు తెచ్చే ఆలోచన లేదుగాని తెలంగాణ సాధించిన కేసీఆర్ పై ఇష్టానుసారంగా మాట్లాడడం సంజయ్ అవివేకానికి నిదర్శనమన్నారు. మరోసారి కేసీఆర్‌పై నోరుజారితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజక వర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాజారమేశ్, పట్టణ అధ్యక్షుడు జే.రవీందర్, బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు రాజశేఖర్, బండారు సూరిబాబు, బడికెల సంపత్ కుమార్, ఈశ్వర్, మద్ది శంకర్, సంగ వెంకటేశ్, పల్లె నర్సింగ్, భట్టు రాజ్‌కుమార్, ఎండీ ముస్తఫా, బర్ల సదానందం, ప్రతాప్ సారంగపాణి, మోహన్, దాసరి నవీన్, అందె శ్రీకాంత్, నాయకులు చిప్పకుర్తి రేఖ, రమా, శారద పాల్గొన్నారు.
కోటపల్లి, మార్చి 24 : కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని కోటపల్లి పోలీస్‌స్టేషన్‌లో చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్‌కు బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వాల శ్రీ నివాస్‌రావు మాట్లాడుతూ కేసీఆర్‌పై విమర్శలు చేసి హైలెట్ కావాల ని బండి సంజయ్ తన హోదాను తగ్గించుకొని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఏమిటో తెలంగాణ ప్రజలకు తెలుసునని, కేసీఆర్ ఓట్ల కోసం, సీట్ల కోసం తన హోదాను తగ్గించుకోడని అన్నారు.
పీఏసీఎస్ అధ్యక్షుడు సాంబాగౌడ్, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు మారిశెట్టి విద్యాసాగర్, డైరెక్టర్ మల్లయ్య, నాయకులు కొట్టె నారాయణ, తిరుపతి రావ్, అక్కల మధూకర్, చందు, రాళ్లబండి స్వామి, కామ శ్రీనివాస్, కుమార్, అజ్మెర పున్నం, మారుపాక పోచం, గోనె మోహన్ రెడ్డి, భూమయ్య, ఆసంపల్లి సంపత్‌కుమార్, గుగ్లోత్ బాపు నాయక్, ఇందూరి మహేశ్, కామెర పవన్, కొట్రంగి మల్లేశ్, అజయ్ పాల్గొన్నారు.
మంచిర్యాల అర్బన్, మార్చి 24 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నోరుజారిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు. నాయకులు అంకం నరేశ్, శ్రీరాముల మల్లేశ్, అక్కూరి సుబ్బన్న, మెరుగు పవన్, బేర సత్యనారయణ, పంబాల ఎర్రయ్య, పెరమల్ల జానార్థన్, కుమ్మం రాజేశ్వర్ రెడ్డి, కొండపర్తి శంకర్, కాటంరాజు, మహమ్మద్ సాజిద్, తదితరులు పాల్గొన్నారు.