జైనూర్, ఆగస్టు 1 : జైనూర్ మండల కేంద్రంలో స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా రూ. 2 లక్షలతో నిర్మించిన సామూహిక మరుగుదొడ్లతో పాటు కామన్ సర్వీస్ సెంటర్ను ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జిల్లా అదనపు కలెక్టర్ దిపక్ తివారీ శుక్రవారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో డీఆర్డీవో దత్తరాం, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్, సహకార సంఘం చైర్మన్ కొడప హన్ను పటేల్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదోరావ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఇంతియాజ్ లాలా, మాజీ వైస్ ఎంపీపీ చీర్లె లక్ష్మణ్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు మడావి భీంరావ్, మాజీ సర్పంచులు, గేడం లక్ష్మణ్, మెస్రం నాగోరావ్, యువ నాయకుడు సతీస్ ముండే, దౌలత్రావ్, సీనియర్ నాయకులు మెస్రం అంబాజీరావ్, ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, ఎంపీవో మోహన్, తహసీల్దార్ ఆడ బీర్షా, పాల్గొన్నారు.