మంచిర్యాల ఏసీసీ, జూన్ 16 : బక్రీద్ పండుగను రామగుండం కమిషనరేట్ పరిధిలోని ముస్లింలు ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించుకోవాలని పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సూచించారు. ఆదివారం రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీ య సంఘటనలు జరగకుండా మసీదు లు, ఈద్గాల వద్ద పటిష్టమైన బందోబస్తు ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
బందోబస్త్ విధులకు హాజరయ్యే అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల వ్యాప్తంగా 15 రోజులుగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నిరంతరం వాహనాల తనిఖీలు చేపట్టి ఆవుల అక్రమ రవాణా జరగకుండా చర్య లు తీసుకున్నామని తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది మొత్తం బక్రీద్ బందోబస్తులో పాల్గొంటారని తెలిపారు. సోషల్ మీడి యా ద్వారా అసత్య ప్రచారాలు, ఇతరుల మనోభావాలు దెబ్బతినే విధంగా అభ్యంతరకర పోస్టులకు ప్రజలు ప్రతిస్పందించకుండా, సంయమనం పాటించాలన్నా రు.
ఆ పోస్టుల్లో నిజాలను తెలుసుకునేందుకు ప్రయత్నించాలన్నారు. ఎలాంటి వదంతులు వచ్చినా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని లేదా 100 నంబర్‌కు డయల్‌చేసి చెప్పాలని కోరారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను పోస్ట్ చేసిన వారితో పా టు ఫార్వార్డ్ చేసే గ్రూప్ అడ్మిన్లపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆసిఫాబాద్ టౌన్, జూన్16 : బక్రీద్‌ను ముస్లింలు శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ ఎస్పీ సురేశ్ కుమార్ సూచించా రు. బక్రీద్ సందర్భంగా బందోబస్తు నిర్వహించబోయే అధికారులతో ఆదివారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 20 రోజులుగా ఆరు చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నా రు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, రెబ్బెన, జైనూరు మండల కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేసి ఆవుల అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపా రు.
బక్రీద్ సందర్భంగా జిల్లా వ్యా ప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని వాటిని సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. డయల్-100 లేదా సం బంధిత పోలీస్ స్టేషన్లకు సంప్రదించాలని తెలిపారు. శాం తిభద్రతలకు విఘాతం కలిగించాలని చూసినా లేదా అవాంఛనీయ చర్యలకు పాల్పడినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
– కుమ్రం భీం ఆసిఫాబాద్ ఎస్పీ సురేశ్ కుమార్