ఉట్నూర్ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు.
స్థానిక ఎన్నికలు ఎప్పుడూ వచ్చిన ప్రజలు బీఆర్ఎస్ పార్టీకే మొగ్గు చూపుతారని పేర్కొన్నారు. కార్యకర్తలు ఉద్యమ స్ఫూర్తితో ప్రజా క్షేత్రంలో నిలబడాలని కోరారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) , పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ , నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.