Johnson Naik | కాంగ్రెస్ పాలనపై పోరుబాటకు తరలిరావాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి పిలుపు
Johnson Naik | కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ అన్నారు .
ఖానాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress rule ) ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ( Six Guarntees) అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ (Johnson Naik ) అన్నారు . 1000 రోజుల పాలనలో ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు సెప్టెంబర్ 2న ఖానాపూర్ పట్టణ కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వివరించారు. . ఈ కార్యక్రమంలో ధర్నాతో పాటు బాకీ కార్డుల పంపిణీ, 420 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శన చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు హామీల అమలుపై ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు.
నియోజకవర్గంలోని అన్ని మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, యువత, మహిళలు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయక్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన చేపడుతున్న ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్యార్డ్, ఎయిర్క్రాఫ్ట్ యార్డ్లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

