ఉట్నూర్ : జల్, జంగల్, జమీన్ హక్కుల కోసం పోరాటం చేసిన యోధుడు కొమురంభీం అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. బుధవారం స్థానిక కేబీ కాంప్లెక్స్‌లోని కొమురంభీం 81వ వర్ధంతి కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ గిరిజనుల హక్కుల కోసం కొమురంభీం ఎనలేని పోరాటాలు చేశారన్నారు. గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ఏజెన్సీల అభివృద్ధికి ప్రత్యేక జీపీల ఏర్పాటు, దేవాలయాల అభివృద్ధితో పాటు గిరిజనుల దీపావళి పండుగ నిర్వహణకు ప్రతి గుస్సాడికి 10వేలు అందజేచస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏటీడబ్ల్యూఏసీ మాజీ చైర్మన్ కనక లక్కేరావు, ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, వైస్ ఎంపీపీ బాలాజీ, మాజీ జడ్పీడీసీ వాగ్మారే జగ్జీవన్, మర్సకోల తిరుపతి, నాయకులు కందుకూరి రమేశ్, మెస్రం దుర్గు, శ్రీరాంనాయక్, మెస్రం మనోహర్, రాజేశ్, రాజ్‌కుమార్, సుమన్‌బాయి, కళావతి, కోల సత్యం, గిరిజన నాయకులు, పెద్దలు పాల్గొన్నారు.