ఆసిఫాబాద్ టౌన్, జూన్ 14 : మహిళా సంఘాలు స్వశక్తితో ఎదిగేందుకు చర్యలు చేపట్టాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కార్యాలయాల భవన సముదాయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్‌తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళా సంఘాలు స్వశక్తితో ఎదిగేందుకు ప్రోత్సహించాలన్నారు. మహిళలు సొంతంగా వ్యాపారం చేసుకునేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.
ఔత్సాహిక మహిళా సంఘాలు చేపల పెంపకం వైపు దృష్టి సారించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. చేపల పెంపకం ద్వారా తకువ పెట్టుబడితో ఎకువ ఆదాయాన్ని పొందవచ్చునని తెలిపారు. మహిళా సంఘాలకు ఆర్థిక తోడ్పాటు నివ్వాలని సూచించారు. ఈ సమావేశంలో బ్యాంకు అధికారులు, సెర్ఫ్ సిబ్బంది, మెఫ్మా సిబ్బంది, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు, లీడ్ బ్యాంక్ మేనేజర్, స్త్రీ శక్తి మేనేజర్, జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు, సహాయ ప్రాజెక్టు మేనేజర్లు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.