‘టెట్’కు ఏర్పాట్లు
ఈ నెల 15న నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఉపాధ్యాయు అర్హ త పరీక్ష నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్, విద్యాశాఖ, రూట్ అధికారులతో ఆయన సమీ క్షా సమావేశం నిర్వహించారు.
- పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి..
- దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి..
- జవాబు పత్రాలను పటిష్టంగా తరలించాలి..
- విద్యాశాఖ అధికారుల సమావేశంలో కలెక్టర్ రాహుల్‌రాజ్
ఎదులాపురం, సెప్టెంబర్ 12 : ఈ నెల 15న నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఉపాధ్యాయు అర్హ త పరీక్ష నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్, విద్యాశాఖ, రూట్ అధికారులతో ఆయన సమీ క్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్షను పకడ్బందీగా నిర్వహించేలా అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేయాలని సూచించారు. దివ్యాంగ అభ్యర్థుల కోసం ప్రత్యేక ఏర్పా ట్లు చేయాలన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో పేపర్-1 ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. 33 కేంద్రాల్లో 7,716 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని పేర్కొన్నారు. పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. 14 కేంద్రాల్లో 3,124 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, డీఈవో ప్రణీత, చీఫ్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఎరువులు సక్రమంగా అందించాలి
ఇంద్రవెల్లి, సెప్టెంబర్12 : రైతులకు ఎరువుల కొరత సృష్టించకుండా సక్రమంగా అందించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్‌రాజ్ సూచించారు. మండలకేంద్రంలోని పత్తివార్ ఫర్టిలైజర్ దుకాణాన్ని మంగళవారం తనిఖీ చేశారు. దుకాణానికి చెందిన రికార్డులు, బిల్లులను పరిశీలించారు. గోదాముల్లో నిల్వ ఉన్న ఎరువులను సరిచూశారు. ప్రస్తుతం ఇంద్రవెల్లి మండలంలో ఎన్ని ఎరువుల బస్తాలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారి రాథోడ్ గణేశ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా కొరత సృష్టిం చి రైతులను ఇబ్బందులకు గురి చేస్తే వారిపై చ ర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట జీపీ అధికారులు తదితరులున్నారు.
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
ఉట్నూర్, సెప్టెంబర్ 12 : దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఉట్నూర్‌లోని ప్రభుత్వ దవాఖానను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి వార్డు తిరుగుతూ రోగులకు అందుతున్న వైద్యంపై ఆరాతీశారు. రోగులు ఏ సమస్యతో వచ్చారో అడిగి తెలుసుకొని వైద్యులకు పలు సూచనలు చేశారు. డెంగీ జ్వరంతో బాధపడుతున్న నరేశ్‌తో మాట్లాడారు. అనంతరం డయాలసిస్ కేంద్రం, పిల్లల వార్డులను సందర్శించారు. అక్కడి నుంచి ఉట్నూర్ పట్టణంలోని గోండ్రాజుల కోటను సందర్శించారు. ఆయన వెంట ఐటీడీఏ ఇంజినీరింగ్ ఈఈ రాథోడ్ భీంరావ్, దవాఖాన సూపరింటెండెంట్ ఉపేందర్, వైద్యుడు మహేందర్, ప్రచారశాఖ అధికారి విష్ణు, ఇతర శాఖల సిబ్బంది ఉన్నారు.
మట్టి విగ్రహాల పరిశీలన
ఎదులాపురం, సెప్టెంబర్ 12 : పర్యావరణానికి హాని చేయని మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు పట్టణంలోని బీసీ స్టడీ సర్కిల్ భవనంలో బీసీ సంక్షేమ శాఖ ద్వారా పంపిణీ చేయనున్న మట్టి గణపతి విగ్రహాలను పరిశీలించారు. ప్రజలు ఇండ్లలో మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించాలని సూచించారు. ఆయన వెంట జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజలింగం, స్టడీ సర్కిల్ డైరెక్టర్ జీ ప్రవీణ్ కుమార్ ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

