మంచిర్యాల అర్బన్, మార్చి 8 : కుటుంబా న్ని తీర్చిదిద్దడం నుంచి దేశాన్ని పాలించే వర కూ.. అన్ని రంగాల్లో మహిళల పాత్ర కీలకమైనదని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కా ర్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవా న్ని డీసీపీ భాసర్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు, జిల్లా సంక్షేమశాఖ అధికారి రౌవూఫ్ఖాన్తో కలిసి ప్రారంభించారు.
కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళలు సామాజికంగా ఎంతో తోడ్పాటునందిస్తున్నారన్నారు. ప్రభుత్వం మహిళల సంక్షేమానికి కృషి చేస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రోత్సహిస్తున్నదని, అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. అనంతరం జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన మహిళా అధికారులు, ఉద్యోగులను ప్రశంసా పత్రాలు, శాలువాలతో సతరించారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో అధికారులు, మహిళలు పాల్గొన్నారు.