కోటపల్లి, అక్టోబర్11 : అక్రమాలకు తావులేకుండా ఇసుక రవాణా చేయాలని కలెక్టర్ కుమార్దీపక్ అన్నారు. కోటపల్లి మండలంలోని కొల్లూర్ ఇసుక క్వారీని శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అక్రమంగా ఇసుక తరలిస్తే ఉపేక్షించేది లేదన్నారు. నిబంధనల ప్రకారం ఇసుక లోడింగ్ చేయాలని, రాత్రి వేళల్లో క్వారీల్లో ఇసుక నింపరాదని సూచించారు.