ఆధార్ కార్డు ఉంటేనే సంక్షేమ పథకాలు
పీటీజీ తెగలకు చెందిన వారంతా తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలని, అప్పుడే సంక్షేమ పథకాలకు అర్హులుగా గుర్తించడం జరుగుతుందని కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు.
- కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు
ఆసిపాబాద్/ఆసిఫాబాద్ టౌన్, జనవరి 6 : పీటీజీ తెగలకు చెందిన వారంతా తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలని, అప్పుడే సంక్షేమ పథకాలకు అర్హులుగా గుర్తించడం జరుగుతుందని కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, ఆర్డీవో సురేష్తో కలిసి పీటీజీ తెగలకు చెం దిన సంఘాల నాయకులు, పటేళ్లతో పీఎం జన్మన్ పథకంపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పీటీజీ తెగలకు చెందిన ఆదివాసీ, గిరిజనుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన జన్మన్ పథకం లబ్ధి పొందాలంటే జిల్లాలోని పీటీజీ కులాల వారు తప్పనిసరిగా ఆధార్ కా ర్డు కలిగి ఉండాలన్నారు. ఈ నెల 15వ తేదీలోగా జన్మన్ బ్యాంకు ఖాతా, కుల ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలని సూచించారు. ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డ్, ఆయుష్మాన్ భారత్ పథకం కింద హెల్త్ కార్డులు జారీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కుల సంఘాల నాయకులు, గ్రామ పటేళ్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

