మొరం తవ్వకాలపై ఉక్కుపాదం
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న మొరం తవ్వకాలపై ఈ నెల 12వ తేదీన ‘నమస్తే తెలంగాణ’ లో ‘మొరంపై కన్ను.. అధికారులే దన్ను’ శీర్షికన ప్రచురితమైన కథానికి జిల్లా అధికార యంత్రాంగం కదిలిం ది.
- ‘నమస్తే తెలంగాణ’ కథనానికి కదిలిన యంత్రాంగం
- జామ్లో మొరం తవ్వకాల ప్రదేశాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
సారంగాపూర్, మార్చి 17 : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న మొరం తవ్వకాలపై ఈ నెల 12వ తేదీన ‘నమస్తే తెలంగాణ’ లో ‘మొరంపై కన్ను.. అధికారులే దన్ను’ శీర్షికన ప్రచురితమైన కథానికి జిల్లా అధికార యంత్రాంగం కదిలిం ది. కలెక్టర్ అభిలాష అభిన వ్, ఎస్పీ జానకి షర్మిలలు మంగళవారం జామ్ గ్రామ నాగమ్మ చెరువు, కర్షలగుట్టలను తనిఖీ చేశా రు.
మొరం తవ్వకాల తీరును పరిశీలించి అ నుమతులు లేకుండా, నిబంధనలకు వీరుద్ధంగా కార్యకలాపాలు జరగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్రమ తవ్వకాలను గుర్తించిన పక్షంలో అధికాలరుపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల అవసరాలు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలకు కోసం మొరం తవ్వకాలు చేపట్టాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా రెవెన్యూ, మైనింగ్ అధికారుల అనుమతి పొందిన తరువాత మాత్రమే తవ్వకాలు చేపట్టాని సూచించారు.
కమర్షియల్గా మొరం తవ్వకాలు జరిపే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కర్షలగుట్ట అన్యాకాంత్రం అవుతున్న దృష్ట్యా ప్రభుత్వ భూమి ఎంత ఉందో సర్వే చేసి పూర్తి వివరాలు పంపాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎస్పీ జానకి షర్మిల, రెవెన్యూ అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, తహసీల్దార్ సంధ్యారాణి, ఎస్ఐ శ్రీకాంత్, ఆర్ఐ నర్సయ్య, ఉపసర్పంచ్ బింగి గంగాధర్, నాయకులు కరిపె విలాస్, రాజలింగం, రాములు, మహేందర్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | ఘోరం.. అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం..!
Keerthy Suresh | ‘లతా రెడ్డి’గా కీర్తి సురేశ్ కొత్త అవతారం.. సంక్రాంతి బరిలో వెంకీ సినిమా!
Garividi Lakshmi | ‘గరివిడి లక్ష్మి’ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కోకిల బయోపిక్ ఎలా ఉందంటే?
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
Kidnap Case | సీజీఎస్టీ రిటైర్డ్ కమిషనర్ కిడ్నాప్.. గంటల్లోనే ఛేదించిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

