జైనథ్, మే 26 : ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని కాప్రి గ్రామంలో మంగళవారం ఒకే కుటుంబానికి చెందిన తోటికోడళ్లు ఎల్మా పుష్పతబాయి(70), ఎల్మా సుశీలబాయి(63)లు మృతి చెందారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఎల్మా పుష్పతబాయి పక్షం రోజులుగా ఆరోగ్యం బాగా లేకపోవడంతో మంచానికే పరిమితమైంది.
ఈ క్రమంలో మంగళవారం ఉదయం 10.30 గంటలకు మృతి చెందింది. ఆమెకు అంత్యక్రియలు పూర్తి చేసుకొని ఇంటికి కొచ్చారు. జ్వరంతో బాధపడుతూ రెండు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తోటి కోడలు ఎల్మా సుశీలబాయికి చనిపోయిన విషయం తెలిసింది. ఆమె మనోవేదనకు గురై మధ్యాహ్నం 2 గంటలకు మృతి చెందింది. ఇలా గంటల వ్యవధిలో ఇద్దరు మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.