శ్రీరాంపూర్, ఫిబ్రవరి 28 : శ్రీశైలం ఎస్ఎల్బీసీ (టన్నెల్) సొరంగంలో చిక్కుకున్న 8 మందిని వెలికి తీసే చర్యల్లో సింగరేణి సీఎండీ బలరాం.. రెస్క్యూ సిబ్బందితో కలిసి పాల్గొంటున్నట్లు జీఎం శ్రీనివాస్, డైవీజీఎం అరవిందరావు తెలిపారు. శుక్రవారం శ్రీరాంపూర్‌లో వారు మాట్లాడుతూ రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా సీనియర్ పీవో, 40 మంది ఉద్యోగులు, సూపర్వైజర్, సెక్యూరిటీ గార్డును ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులో పంపించామన్నారు.
సొరంగంలోకి లోకో రైలులో వీరంతా వెళ్లినట్లు తెలిపారు. వారం రోజులుగా రాష్ట్ర, కేంద్ర బృందాలతో కలిసి సహాయ చర్యల్లో సింగరేణి బృందం నిమగ్నమైందని తెలిపారు. రామగుండం రెస్క్యూ కేంద్రం ద్వారా బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, ఆర్జీ-1, 2,3ల నుంచి 200 మంది పాల్గొంటున్నారని, సీఎండీ బలరాం 24 గంటల పాటు వారితోనే ఉంటూ సహాయక చర్యలకు నాయకత్వం వహించడం హర్షించదగినదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటూజీఎం సత్యనారాయణ, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ శ్రీధర్‌రావు, అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, ఏజెంట్లు రాజేందర్, శ్రీధర్, వెంకటేశ్వర్లు, పీవోలు వెంకటేశ్వర్‌రెడ్డి, డీవైజీఎం చిరంజీవులు, ఆనంద్‌కుమార్, రవీంద్, మల్లయ్య, సెక్యూరిటీ ఆఫీసర్ జక్కారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.