తాంసి : సీఎం రిలీఫ్‌ఫండ్ పేదలకు వరమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. గురువారం తాంసి ఎంపీడీవో కార్యాలయంలో భీంపూర్, తలమడుగు, తాంసి మండలాలకు చెందిన 8 మంది లబ్ధిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కష్టసమయంలో నిరుపేదలకు ఈ పథకం ద్వారా అభయహస్తం లభించినట్లు అవుతుందని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో నిరుపేదలకు లక్షల రూపాయలు దవాఖాన ఖర్చులకు అందుతున్నాయని వివరించారు.
అత్యవసర సమయంలో ఎల్ఓసీ ద్వారా నిరుపేదల వైద్యానికి సహాయం అందిస్తుందని, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని అన్నారు. టీఆర్ఎస్ జిల్లా నాయకులు సామ నాగారెడ్డి, సర్పంచులు కృష్ణ, సదానందం, కేశవ్‌రెడ్డి, శ్రీనివాస్, ఎంపీటీసీలు రఘు, అశోక్, టీఆర్ఎస్ నాయకులు మొట్టె కిరణ్, శ్రీనివాస్‌రెడ్డి, ఆశన్న , విలాస్, ధనుంజయ్, గంగరాం, మహేందర్, కార్యకర్తలు పాల్గొన్నారు.