నార్నూర్, జూన్ 25 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆదిలాబాద్ జడ్పీచైర్మన్ రాథో డ్ జనార్దన్ పిలుపునిచ్చారు. నార్నూర్ మండలం భీంపూర్‌లో ఆదివారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పోడు భూముల పట్టాలు పంపిణీ చేయడంతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. గ్రామాల నుంచి బహిరంగసభకు ప్రజలు పెద్దసంఖ్యలో హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, ఖైరదట్వా సర్పంచ్ కనక ప్రభాకర్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు యూన్సిఅక్బానీ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్లొన్నారు.
విద్యాభివృద్ధికి ప్రాధాన్యం
ఉట్నూర్, జూన్ 25: విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. ఉట్నూర్‌లోని బీసీ వసతి గృహంలో విద్యార్థులకు నోట్‌బుక్స్, వసతి సామగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.