బీఆర్ఎస్ పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆదివారం సీఎం కేసీఆర్ బీ-ఫామ్స్ అందజేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది మందికి ఇచ్చారు. ఒక్కొక్కరికి రెండు బీ-ఫామ్స్‌తోపాటు, రూ.40 లక్షల విలువ గల చెక్కులు అందించారు. తెలంగాణ భవన్లో బీ-ఫామ్స్ ఇచ్చిన అనంతరం కేసీఆర్ మాట్లాడారు. బీ-ఫామ్స్ నింపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సందేహాల నివృత్తికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.
అభ్యర్థులు నిత్యం ప్రజల్లోనే ఉండాలని, ప్రతి చిన్న కార్యకర్తతో మాట్లాడే ప్రయత్నం చేయాలని సూచించా రు. ఎవరికైతే అవకాశం రాలేదో వారు తొందరపడాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా సెలెక్ట్ అవ్వడమే ఫైనల్ కాదని, రానున్న రోజుల్లో ఎన్నో అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో బీ-ఫామ్స్ అందుకున్న వారిలో.. ఇంద్రకరణ్‌రెడ్డి(నిర్మల్), బాల్క సుమన్ (చెన్నూర్), జోగు రామన్న (ఆదిలాబాద్), అనిల్ జాదవ్(బోథ్), విఠల్‌రెడ్డి(ముథోల్), జాన్సన్ నాయక్(ఖానాపూర్), దివాకర్‌రావు(మంచిర్యాల), దుర్గం చిన్నయ్య(బెల్లంపల్లి), కోవ లక్ష్మి(ఆసిఫాబాద్), కోనేరు కోనప్ప(సిర్పూర్(టీ) ఉన్నారు.
అభ్యర్థి పేరు : అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
తండ్రి : అల్లోల నారాయణ రెడ్డి
పుట్టిన తేది : 16-02-1949
వయస్సు : 74
విద్యార్హత : బీకాం. ఎల్.ఎల్.బీ
కుటుంబం : భార్య అల్లోల విజయలక్ష్మి, కుమార్తె పల్లవి, కుమారుడు గౌతం రెడ్డి.
అడ్రస్ : ఇంటి. నంబర్ 1-3-1 శాస్త్రినగర్, నిర్మల్.
ఫోన్ నంబర్ : 08734-242288, 9848024246
రాజకీయ ప్రస్థానం..
1987-91 జిల్లా పరిషత్ చైర్మన్‌గా రాజకీయ ప్రవేశం
1991-96 పార్లమెంట్ సభ్యుడిగా, (కన్వీనర్ తెలంగాణ కాంగ్రెస్
లెజిస్లేటివ్ ఫోరం. మెంబర్ ఆఫ్ తెలంగాణ రీజినల్
కాంగ్రెస్ కో ఆర్డినేటర్ కమిటీ
1999-04 ఎమ్మెల్యేగా
తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం (టీసీఎల్‌ఎఫ్ కన్వీనర్)
మెంబర్ ఆఫ్ రీజినల్ కాంగ్రెస్ కోఆర్డినేటివ్ కమిటీ (టీఆర్ సీసీసీ)
2004-2008 ఎమ్మెల్యేగా ఎన్నిక
2008-09 ఎంపీగా ఎన్నిక (బై ఎలక్షన్లో)
2014 ఎమ్మెల్యేగా ఎన్నిక
2014-18 క్యాబినేట్ మంత్రిగా గృహ నిర్మాణ, దేవాదాయ,
న్యాయ శాఖ మంత్రిగా..
2018లో ఎమెల్యేగా ఎన్నిక
2018-2023 వరకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ,
దేవాదాయ శాఖ మంత్రిగా
అభ్యర్థి పేరు : జోగు రామన్న
తల్లిదండ్రులు : భోజమ్మ, ఆశన్న
పుట్టిన తేది : 4-7-1960
విద్యార్హత : బీఏ
కుటుంబం : భార్య రమ, కుమారులు జోగు ప్రేమేందర్, జోగు మహేందర్
స్వస్థలం : దీపాయిగూడ, జైనథ్ మండలం
రాజకీయ ప్రస్థానం..
తెలుగుదేశం పార్టీలో 1984 చేరిక
1985-86 జైనథ్ మండలం టీడీపీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి 1987-88 టీడీపీ మండల అధ్యక్షుడు, మార్చి 1988-95 దీపాయిగూడ సర్పంచ్, జూన్ 1988-95 జైనథ్ మండల ఉపాధ్యక్షుడు, 1995-2001 జైనథ్ మండలాధ్యక్షుడు , 2006- 2009 జైనథ్ జడ్పీటీసీ, జూలై 2001- 2009 జిల్లా పరిషత్‌లో టీడీపీ విప్ , 2004 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నిక
16-5-2009 తెలంగాణ కోసం టీడీపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా
23-11-2011 బీఆర్ఎస్లో చేరిక, ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపు
31-3-2012, 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా విజయం, 2014లో రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ..
2018 సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపు. నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా 2022లో ఎన్నిక
పేరు : భూక్యా జాన్సన్ నాయక్
తల్లిదండ్రులు : కేస్లీబాయి శామ్యూల్ నాయక్
పుట్టిన తేది : 06-06-1976
విద్యార్హత : హైదరాబాద్‌లోని నిజాం కళాశాల నుంచి జెనెటెక్స్ విభాగంలో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఆప్లికేషన్స్లో పీజీ డిప్లొమా పూర్తి చేశారు.
కుటుంబం : భార్య పేరు: భూక్యా జయలక్ష్మిబాయి (ఏఈఈ టీటీడీ)
జన్మించిన స్థలం : తిమ్మాపూర్ తండా, మండలం ఇబ్రహీంపట్నం, జిల్లా జగిత్యాల
అడ్రస్ : ఖానాపూర్‌లోనే ఇటీవల నివాస గృహాన్ని తీసుకొని ఉంటున్నారు.
ఉద్యోగ నిర్వహణ
ఆస్ట్రేలియా దేశంలో పెండ్రాగాన్ మేనేజ్మెంట్ కంపెనీలో రెండేళ్ల పాటు పని చేశారు. ఆ తర్వాత అమెరికాలోని కాలిఫోర్మియా రాష్ట్రంలో సాఫ్ట్వేర్ ఐటీ కన్సల్టెన్సీ సంస్థను నెలకొల్పారు. తెలంగాణలోని గిరిజన తండాల నుంచి అనేక మంది గిరిజన విద్యార్థులకు విదేశీ విద్యపై అవగాహన కల్పించడమే కాకుండా, విదేశాల్లో స్థిరపడేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణనిచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అంబేద్కర్ ఓవర్సీస్ పథకం గురించి గిరిజన విద్యార్థులకు అవగాహన కల్పించారు.
తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీ కోసం చేసిన కార్యక్రమాలు:
తెలంగాణ ఉద్యమం సమయంలో అమెరికాలో నిర్వహించిన అనేక నిరసన కార్యక్రమాలు, ర్యాలీలో పాల్గొని ఈ ప్రాంత సమస్యను, రాష్ట్ర ఏర్పాటు ప్రాముఖ్యతను విదేశాల్లో వినిపించడం జరిగింది. ఉద్యమ సమయంలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల్లో సెమినార్లో ప్రసంగించి రాష్ట్ర ఏర్పాటు ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. రాష్ట్రంలో జరిగిన సకలజనుల సమ్మెలో, ఆందోళనలో, నిరసన కార్యక్రమం, ర్యాలీల్లో పాల్గొనడం జరిగింది.
అభ్యర్థి పేరు : జాదవ్ అనిల్‌కుమార్
తల్లిదండ్రులు : యశోద, జే రామారావ్
పుట్టిన తేది : 16-06-1972
వృత్తి : రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త
విద్యార్హత : బీఏ (పోలిటికల్ సైన్స్) ఫిజికల్ ఎడ్యూకేషన్ టీచర్
కుటుంబం : భార్య హరిప్రియ, కుమారులు ఆర్యన్, అర్జున్
అడ్రస్ : జే అనిల్‌కుమార్, హౌస్ నంబర్.100/1, నేరడిగొండ గ్రామం, నేరడిగొండ మండలం, ఆదిలాబాద్ జిల్లా – 504323, తెలంగాణ
ఫోన్ నంబర్ : 9440414440, 9492566699
రాజకీయ ప్రస్థానం..
తండ్రి నాలుగు సార్లు సర్పంచ్‌గా రాజురా గ్రామం నుంచి ఎన్నికయ్యారు. 2009 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓటమి, 2014లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓటమి, 2019లో స్వతంత్ర అభ్యర్థిగా ఓటమి,
ప్రస్తుతం నేరడిగొండ జడ్పీటీసీ బీఆర్ఎస్
అభ్యర్థి పేరు : గడ్డిగారి విఠల్ రెడ్డి
తల్లిదండ్రులు : రాజవ్వ, గడ్డెన్న
పుట్టిన తేది : 06.08.1954
వృత్తి : రాజకీయ వేత్త
విద్యార్హత : బీఏ ఎల్ఎల్బీ
కుటుంబం : భార్య గడ్డిగారి లక్ష్మి, కూతురు- సులోచన, కుమారుడు – రామరెడ్డి
అడ్రస్ : గ్రామం దేగాం, మండలం భైంసా, జిల్లా నిర్మల్.
ఫోన్ నంబర్ : 9440885061 రాజకీయ ప్రస్థానం..
2009 ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓటమి
2014లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపొంది బీఆర్ఎస్ పార్టీలో చేరిక
2018లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు.
పూర్తి పేరు : కోవ లక్ష్మి
పుట్టిన తేదీ : 6-2-1969
భర్త : సోనేరావ్ ఉపాధ్యాయుడు
పిల్లలు : ముగ్గురు
తల్లిదండ్రులు : కోట్నాక్ భీంరావ్, భీంబాయి
రాజకీయ ప్రస్థానం..
1995లో పంగిడిమాదారాం ఎంపీటీసీ
2001లో పంగిడిమాదారాం నుంచి రెండోసారి ఎంపీటీసీ
2002లో తిర్యాణి మండల ఎంపీపీగా
2006లో ఆసిఫాబాద్ సర్పంచ్‌గా
2010 లో టీఆర్ఎస్లో చేరిక
2013లో ఆసిఫాబాద్ సర్పంచ్‌గా
2014 సాధారణ ఎన్నికల్లో ఆసిఫాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపు
2018 ఎన్నికల్లో స్వల్ప తేడాతో (173 ఓట్లతో) ఓటమి
2019 లో జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నిక
2023లో ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ..