అందరూపాసయ్యేలా చూస్తాం
మండల కేంద్రంలోని కేజీబీవీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఎంపీసీ విద్యార్థినులు గురువారం హాస్టల్ వదిలి వెళ్లిన ఘటపై జిల్లా అధికారులు స్పందించారు. కస్తూర్బాను జిల్లా కేజీబీవీ ప్రత్యేక ఇన్చార్జి అధికారి సుభాష్, మండల విద్యాధికారి సోమయ్య, జిల్లా సైన్స్ అధికారి కటుకం మధూకర్ శుక్రవారం సందర్శించారు.
- ఇన్చార్జి ఎస్వో శ్రీదేవిపై చర్యలు తీసుకుంటాం
- చింతలమానేపల్లి కేజీబీవీ విద్యార్థినులతో అధికారులు
- పలుమార్లు సముదాయించినా తిరిగి వెళ్లిపోయిన పిల్లలు
చింతలమానేపల్లి , మార్చి 8 : మండల కేంద్రంలోని కేజీబీవీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఎంపీసీ విద్యార్థినులు గురువారం హాస్టల్ వదిలి వెళ్లిన ఘటపై జిల్లా అధికారులు స్పందించారు. కస్తూర్బాను జిల్లా కేజీబీవీ ప్రత్యేక ఇన్చార్జి అధికారి సుభాష్, మండల విద్యాధికారి సోమయ్య, జిల్లా సైన్స్ అధికారి కటుకం మధూకర్ శుక్రవారం సందర్శించారు. గురువారం రాత్రి ఇళ్లకు వెళ్లిన 11 మందిని తిరిగి స్కూల్‌కు పిలిపించారు.
హాస్టల్లో ఉండాలని, మిగిలిన పరీక్షలు రాయాలని విద్యార్థినులను అధికారులు కోరగా, ఇందుకు వారు ఒప్పుకోలేదు. మ్యాథ్స్ లెక్చరర్ లేక కనీసం పరీక్షలో అక్షరం కూడా రాయలేకపోయామని, ఈ విషయాన్ని ఇన్చార్జి ఎస్వో శ్రీదేవికి చెప్పుకుంటే.. పోలీస్ కేసులు పెడతామని ఆమె బెదిరించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. డీఈవో ఆదేశాల మేరకు ఇద్దరు పీజీ సీఆర్టీలను కూడా తీసుకువచ్చామని, వారితో మెరుగైన విద్య అందిస్తామని, అందరూ పాస్ అయ్యేలా చూస్తామని అధికారులు విద్యార్థినులకు భరోసా ఇచ్చారు.
పలుమార్లు వారిని సముదాయించినా ఫలితం లేకుండా పోయింది. ఇక్కడుంటే తమకు వేధింపులు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తూ విద్యార్థినులు వెళ్లిపోయారు. కాగా, తన తప్పేమీ లేదని ఇన్చార్జి ఎస్వో జిల్లా అధికారులకు చెప్పడం గమనార్హం. త్వరలోనే ఈ అంశంపై డీఈవోకు నివేదిక అందజేస్తామని అధికారులు తెలిపారు. కాగా, హాస్టల్లో మొత్తం 15 మంది విద్యార్థినులుండగా, ఇందులో 11 మంది వెళ్లిపోయారు. ప్రస్తుతం ముగ్గురు మాత్రమే ఉండగా, మరొకరు జ్వరంతో అంతకుముందే ఇంటికి వెళ్లిపోయినట్లు సమాచారం.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొత్త జిల్లాలు.. అభివృద్ధి ఖిల్లాలు
కాలిన మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లతో ఆందోళన
రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం.. కాంగ్రెస్ వచ్చింది ఉయ్యాలో.. కరెంటు పోయింది ఉయ్యాలో..
తెల్లారేలోగా ఊరంతా నేలమట్టం.. అర్ధరాత్రి వేళ.. పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు
కరెంట్ కోసం ఎదురుచూపులే.. కోతలు, లోవోల్టేజీ సమస్యలపై రైతుల ఆందోళనలు.. పలుచోట్ల ధర్నాలు, సబ్స్టేషన్ల ముట్టడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

