ఎదులాపురం, మార్చి 3 ః ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ను అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని సచివాలయంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించి దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఈ ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 2న గ్రామసభలు, ఏప్రిల్ 16న మండల స్థాయి కార్యక్రమాలు, మే 2న నియోజకవర్గ స్థాయి, మే 22న జిల్లా స్థాయి సమావేశాలను నిర్వహించాలని, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలతో ఈ కార్యక్రమం ముగియనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు.