HomeAdilabadChief Electoral Officer Sudarshan Reddy Says That All The Eligible Should Be Registered As Voters
అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయాలి
అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కెరమరి మండలం దేవాపూర్, అనార్పల్లి, తుమ్మగూ డ గ్రామపంచాయల్లోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారీ, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి కలిసి సందర్శించారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్/కెరమెరి, నవంబర్ 8 : అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కెరమరి మండలం దేవాపూర్, అనార్పల్లి, తుమ్మగూ డ గ్రామపంచాయల్లోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారీ, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి కలిసి సందర్శించారు. బూత్ స్థాయి అధికారులకు తగు సూచనలు చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు చేరుకొని మాట్లాడారు. నూతన ఓటరు నమోదుకు ఫారం 6 ద్వారా దరఖాస్తు స్వీకరించాలని, పేర్లు, చిరునామా, ఇతర తప్పుల సవరణ కోసం అందిన దరఖాస్తులను పరిషరించాలని, మరణించిన వారి వివరాలను జాబితా నుంచి తొలగించాలని అధికారులకు సూచించారు.
ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఇంటింటి సర్వే చేపట్టడం జరిగిందని, అక్టోబర్ 29న ఓటరు జాబితా ముసాయిదా ప్రకటించడం జరిగిందని, ఇట్టి జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే బూత్ స్థాయి అధికారులకు తెలియజేయాలన్నారు. అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిషారం అనంతరం 2025 జనవరి 1న తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు. ఈ నెల 9, 10 తేదీల్లో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అనంతరం ఆయన ముగ్గుల పోటీలను తిలకించి.. విజేతలకు బహుమతులు అందజేశారు. ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్ రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారాం, తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, బూతు స్థాయి అధికారులు పాల్గొన్నారు.
పొరపాట్లకు తావివ్వద్దు
జైపూర్, నవంబర్ 8 : పొరపాట్లకు తావులేకుండా ఓట రు జాబితా రూపొందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఇందా రం గ్రామంలోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ కుమార్‌దీపక్‌తో కలిసి సందర్శించారు. ఓటరు తొలగింపు సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ వనజారెడ్డి, ఆర్ఐ తిరుపతి, బీఎల్వో సూపర్వైజర్లు, బీఎల్వోలు పాల్గొన్నారు.
ఎన్నికల పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి
ఆసిఫాబాద్ టౌన్, నవంబర్ 8: గతేడాది నిర్వహించిన శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో సేవలందించిన వారికి ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డికి బా ధితులు వినతి పత్రం అందజేశారు. ఆసిఫాబాద్‌లో జరిగిన ఎన్నికలకు సంబంధించి భోజన వసతి కల్పించిన వారికి రూ. 18 లక్షలు, వీడియో గ్రాఫర్స్‌కు రూ. 15 లక్షలు, పెట్రోల్, డీజిల్ పోసిన బంకు యజమానులకు రూ. 17 లక్షలు, కంప్యూటర్ దుకాణాదారులకు రూ. 13 లక్షలు, వాహనాలకు రూ. 7.05 లక్షలు పెండింగ్ బకాయిలు ఉన్నాయని, మంజూరు చేయకుంటే ఆందోళనలు చేపడుతామన్నారు. నెల రోజుల్లోగా పెండింగ్ బిల్లులు మంజూరు అయ్యేలా చూస్తానని సీఈవో తెలిపినట్లు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో బాధితులు సుదర్శన్, సలీం, వంశీ, గుండ సోను, తిరుపతి , తదితరులు పాల్గొన్నారు.
స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలి
నస్పూర్,నవంబరు 8 : ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ మోతీలాల్, ఆర్డీవోలు శ్రీనివాసరావు, హరికృష్ణ, చంద్రకళతో కలిసి అధికారులతో సమావేశం నిర్వ హించారు. ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన వారి వివరాలను ఓటరు జాబితాలో నమోదు చేయాలన్నారు.